airforse
-
లెజండరీ ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి
అతనుయుద్ధం మొదలైన తొలిరోజే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చేసి గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసలు అందుకున్నాడు. వైమానిక దాడులతో రెచ్చిపోతున్న రష్యాకి దడ పుట్టేలా చేశాడు. ఎవరా పైలెట్ ఫైటర్ అని రష్యా బలగాల్లో ఒకటే ఉత్కంఠ. రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసి సుమారు 40 యుద్ధ విమానాలకు కూల్చేశాడు ఉక్రెయిన్‌లో ఘొస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే యుద్ధ వీరుడు. రష్యా బలగాలను మట్టికరింపించేలా చివరి శ్వాస వరకు పోరాడాడు. war hero dies in battle after shooting down 40 Russian aircraft: ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా పిలిచే 29 ఏళ్ల స్టెపాన్ తారాబల్కా అనే ఉక్రెనియన్ ఫైటర్ పైలెట్ గత నెలలో జరిగిన యుద్ధంలో మరణించాడని వైమానికదళ అధికారులు వెల్లడించారు. అతను మిగ్ 29 ఫైలెట్లో వెళ్తున్నప్పుడూ శత్రుదళాలు జరిపిన కాల్పులో మరణించాడని తెలిపారు. అతను యుద్ధం మొదలైన తొలరోజునే ఆరు రష్యా యుద్ధ విమానాలను కూల్చి వేశాడని చెప్పారు. దీంతో అతన్ని ఉక్రెనియన్లు గార్డియన్ ఏంజెల్‌గా ప్రశంసించారు. అంతేకాదు తారాబల్కా ఘోస్ట్ ఆఫ్ కీవ్‌గా యుద్ధంలో రహస్య ఆపరేషన్లు చేపట్టి దాడులు చేస్తుంటాడని తెలిపారు. అంతేకాదు యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 40 రష్యా యుద్ధ విమానాలను కూల్చాడు. దీంతో రష్యా బలగాలకు నిద్రపట్టకుండా చేసే ఒక భయంకరమైన వ్యక్తిగా మారాడు. తారాబాల్కకు మరణానంతరం యుద్ధంలో కనబర్చిన ధైర్యసాహసాలకు ఇచ్చే ఉక్రెయిన్ అత్యుత్తమ పతకం ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్, హీరో ఆఫ్ ఉక్రెయిన్ అనే బిరుదును అందించారు. అతనికి భార్య ఒలేనియా, ఎనిమిదేళ్ల కుమారుడు యారిక్ ఉన్నారు. తారాబల్కా పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొరోలివ్కా అనే చిన్న గ్రామంలోని శ్రామిక కుటుంబంలో జన్మించారు. అతను చిన్నప్పుడూ తన గ్రామం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న ఫైటర్ జెట్లు పైలట్ కావాలనుకునేవాడు. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వం తారాబల్కా మరణం గురించి ఎలాంటి సమంచారం ఇవ్వదని తల్లిదండ్రులు చెబుతుండటం గమనార్హం. ఉక్రెయిన్ ధైర్య సాహసాలు ప్రంపంచానికి అవగతమయ్యేలా వీరోచితంగా పోరాడి గొప్ప వీర మరణం పొందాడు. తారాబల్కా మరణించినా అతని ధైర్య సాహసాలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. (చదవండి: రష్యా బలగాలు నాడు మా దాకా వచ్చాయి.. టైమ్ మ్యాగజైన్‌పై జెలెన్స్కీ) -
క్షణమొక యుగంలా..
గోపాలపట్నం : మా ఆయన వచ్చేస్తారంటూ ధైర్యం? వస్తారంటారా అని అనుమానం? ఎక్కడున్నారో అని ఆందోళన... ఇదీ విమానంలో గల్లంతైన ఎన్ఏడీ ఉద్యోగుల భార్యల్లో ఉద్విఘ్నమైన పరిస్థితి. ఎవరెళ్లి పలకరించినా ఇదే ఆవేదన.. ఆందోళన. ఎన్ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పి.నాగేంద్రరావు, ఆర్వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్ మహారాణా, ఎన్.చిన్నారావు, జి.శ్రీనివాసరావులతో పాటు 29 మంది ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్టుగార్డు ఉద్యోగులు చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్టుబ్లెయిర్‌కు ఎయిర్‌ఫోర్సు విమానంలో వెళ్తూ గత శుక్రవారం ఉదయం గల్లంతైన సంగతి తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం నుంచి నిద్రహారాలు సహించక ఆయా కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. క్షణమొక యుగంలా రాక కోసం ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. తిండి సహించడం లేదు.. గర్భిణి కావడంతో గంట్ల శ్రీనివాసరావు భార్య ఈశ్వరి పరిస్థితి మరింత బాధగా ఉంది. గత శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిండి సహించడం లేదు. కునుకు తీయడంలేదు. భర్త జాడ ఏమైందంటూ అందర్నీ వేడుకుంటోంది. ఎవరి నోట విన్నా ఇంకా తెలీదన్న మాటే వస్తుండడంతో సానుకూల కబురు కోసం టీవీ వార్తలను వింటోంది. ఆమె కాస్త అస్వస్థతకు గువ్వవడంతో కుటుంబసభ్యులు ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శ్రీనివాసరావు తల్లి సూరీడమ్మ కొడుకు ఎక్కడున్నాడంటూ రోదిస్తోంది. గుండెలవిసిపోతున్నాయి.. గోపాలపట్నం శ్రీనివాసనగర్‌లో ఉన్న పాటి నాగేంద్ర కుటుంబం తీవ్రఆందోళన చెందుతోంది. ఆరు రోజుల యినా నాగేంద్ర రాకపోవడమేంటని ఆవేదన చెందుతున్నారు. భార్య పూర్ణిమ రోదనలతో గుండెలవిసిపోతున్నాయి. తల్లిదండ్రులు, అత్తమామలు దుఃఖం జీర్ణించుకోలేక, పూర్ణిమని ఓదార్చే శక్తి లేక కుంగిపోతున్నారు. నాగేంద్ర ప్రాణాలతో తిరిగి రావాలని ప్రార్ధిస్తున్నారు. పూర్ణిమకు తిండి, నీరు సహించక పోవడంతో ఆరోగ్యం మందగించింది. ఆమెకు వైద్యులు సెలైన్ ఎక్కించాల్సి వచ్చింది. కేరళ నుంచి నేవీ ఉన్నతాధికారుల ఫోన్ కేరళ నుంచి నేవీ ఉన్నతాధికారులు మంగళవారం పాటి నాగేంద్ర భార్య పూర్ణిమ, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఎయిర్‌ఫోర్స్ విమానం జాడ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇంతవరకూ ఎలాంటి జాడ లేదని చెప్పారు. లేనిపోని వదంతులు నమ్మవద్దని, స్పష్టమైన సమాచారం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
ఎక్కడున్నారో... ఏమయ్యారో...
గోపాలపట్నం : వారు ఎక్కిన ఎయిర్‌ఫోర్సు విమానం గల్లంతై 48 గంటలు గడిచిపోతోంది... అసలు విమానం ఏమైంది... ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) తప్పిందా.... ఉంటే ఎక్కడ వాలిపోయినట్లు... విమానం కూలిపోయిందా... పడిపోతే వాటి శకలాలెక్కడున్నట్లు... వారు బతికి ఉన్నారా... ఏం జరిగి ఉంటుంది... ఇలాంటి సందేహాలు కుటుంబ సభ్యులను దహించేస్తున్నాయి. నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్ఏడీ)కి చెందిన 29 మంది ఉద్యోగులు చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పోర్టుబ్లెయిర్‌కి ఏఎన్–32 ఎయిర్‌ఫోర్సు విమానంలో వెళ్తుండగా మార్గంమధ్యలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఇందులో విశాఖకు చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఇంతవరకు గల్లంతైన ఉద్యోగుల కుటుంబాల్లో కంటిమీద కునుకులేదు. తిండి సహించడం లేదు. కనీసం మంచి నీరైనా మింగుడుపడడం లేదు. వచ్చిన వారందరన్నీ పోర్టుబ్లెయిర్ నుంచి మావారు ఎపుడొస్తారంటూ ప్రా«ధేయపడడం బాధ కలిగిస్తోంది. వారి ఇళ్లలో కన్నీటితో తడిచి ముద్దవుతున్నాయి. ఎప్పుడూ షిప్‌లోనే... ఇపుడు విమానంలో... సాధారణంగా దూరంలో ఉన్న షిప్‌ల్లో ఆయుధ సామగ్రి మరమ్మతులు, నిర్వహణ చేయాల్సి ఉంటే ఎన్ఏడీ సాంకేతిక సిబ్బందిని షిప్‌లలో పంపిస్తుంటారు. విమానాల్లో పంపడం అరుదుగా జరుగుతోంది. అయితే ఎన్ఏడీ ఉద్యోగులు బి.సాంబమూర్తి, భుపేంద్రసింగ్, పి.నాగేంద్రరావు, ఆర్వీ ప్రసాద్‌బాబు, పూర్ణచంద్ర సేనాపతి, చరణ్మహారాణా, ఎన్.చిన్నారావు, జి.శ్రీనివాసరావు బుధవారం విశాఖ నుంచి పోర్టు బ్లెయిర్‌కి బయలుదేరినా గురువారం రాత్రి వరకూ చెన్నైలోనే గడిపారు. శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర సమయంలో చెన్నై సమీపంలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్టుబ్లెయిర్‌కి ఎయిర్‌ఫోర్సు విమానం అందుబాటులో ఉండడం, అక్కడికి వీరితో పాటు 29 మంది ఎయిర్‌ఫోర్సు, నేవీ, కోస్టుగార్డు దళాలు ఉండడంతో సులువుగా వెళ్లొచ్చని భావించారు. ఆ రకంగా బయల్దేరిన కొద్ది సేపటికే ఏటీసీ(ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్) తప్పడంతో సమస్య తలెత్తింది. అసలేం జరిగింది... ఎయిర్‌పోర్సు విమానంలో ఉన్నది సాదాసీదా ఉద్యోగులు కారు. ఎయిర్‌పోర్సు, నేవీ, కోస్టు గార్డుదళాలు. వీరితో ఎన్ఏడీ ఉద్యోగులు ప్రయాణిస్తుండగా, ఏం జరిగినట్లని అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏటీసీ తప్పిందా... విమానం ఎక్కడయినా సాంకేతిక కారణాల వల్ల పడిపోయిందా...అన్న సందేహాలతో అధికారులు అన్వేషిస్తున్నారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో 23 వేల ఎత్తులో ఉందని ప్రచారం సాగుతోంది. ఇది అత్యవసరంగా సిగ్నల్ లేని చోటేమైనా దిగిపోయిందనా అన్న కోణంలోనూ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఒక సబ్ మెరైన్, నాలుగు విమానాలు, ఒక హెలికాఫ్టరు, 15 షిప్‌లు సంద్రంలో జల్లెడపట్టాయని సమాచారం.