సేఫెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇవే..
విమాన ప్రయాణం గాల్లో దీపంలా తయారైన తరుణంలో ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తోన్న కంపెనీల మీద రోజు రోజుకూ ఫోకస్ పెరుగుతోంది. విలాసం, విందు, వినోదాల సమ్మేళనమే విమాన ప్రయాణంగా మారిపోయిన నేపథ్యంలో సదరు సౌకర్యాలతో పాటు సురక్షిత ప్రయాణాన్ని అందించే జాబితాను ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ వెల్లడించింది.
ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ 2016 సంవత్సరానికిగానూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్న టాప్ 20 జాబితాలో తొలి స్థానాన్ని ఆస్ట్రేలియా ప్రీమియర్ ఎయిర్వేస్ క్వాంటాస్‌కు సెవన్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. దీంతో గత మూడేళ్లుగా తన స్థానాన్ని క్వాంటాస్ నిలుపుకున్నట్టయింది.
ప్రంచంలోనే రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన అమెరికన్ ఎయిర్ లైన్స్‌కి ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ ఈ ఏడాదికిగానూ రెండో స్థానం ఇచ్చింది.
1919లో ప్రారంభించిన డచ్ క్యారియర్ కేఎల్ఎమ్కు ఎయిర్ లైన్ రేటింగ్ డాట్ కామ్ జాబితాలో చోటు దక్కింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోన్న ఎయిర్‌లైన్స్‌లో యూరోప్‌లోనే తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంస్థకు చెందిన ఒక్క ఆమ్స్టర్ డ్యాంకు చెందిన నెట్వర్క్ ఏటా 20 మిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది.
మరిన్ని చిత్రాలు, సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..