Airport arrangements
-
ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఇవీ సదుపాయాలు..
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న నగరంలో మరో అద్భుతమైన కట్టడం ఆవిష్కృతం కానుంది. నిజాం కాలం నాటి చారిత్రక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయం తరహాలో అందుబాటులోకి రానుంది. 1870లలో నిర్మించిన రైల్వే స్టేషన్ కళాత్మకతకు ఏ మాత్రం విఘాతం కలగకుండా దీని పునరభివృద్ధికి దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. వాస్తవానికి ఒకటిన్నర దశాబ్దం క్రితమే సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పునరభివృద్ధికి నిర్మాణ సంస్థలను ఆహా్వనించినప్పటికీ ప్రైవేట్ సంస్థలు నిరాసక్తత వ్యక్తం చేశాయి. దీంతో దక్షిణమధ్య రైల్వే స్వయంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. రానున్న 36 నెలల్లో పునరభివృద్ధి చేసేవిధంగా కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే సికింద్రాబాద్ స్టేషన్ వద్ద భూసార పరీక్షలను సైతం నిర్వహించారు. సుమారు రూ.653 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులకు ఈ నెల 19న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రయాణికుల సేవలో.. నాన్ సబర్బన్ గ్రేడ్ –1 (ఎన్ఎస్జీ1) కేటగిరీకి చెందిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.8 లక్షల మంది ప్రయాణం చేస్తారు. రోజుకు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. పండుగలు, వేసవి సెలవులు, ఇతర ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల రద్దీ 2.3 లక్షల వరకు చేరుకుంటుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దక్షిణమధ్య రైల్వేకు ఏటా రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. 2008లోనే వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. వరుసగా బడ్జెట్లలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. కానీ ముందుకు సాగలేదు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన స్టేషన్ల పునరభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కార్యాచరణ మొదలైంది. స్టేషన్ భవనాలను, మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సేవలన్నింటినీ ఆధునికీకరించి ఎయిర్‌పోర్టు తరహాలో ప్రయాణికులకు సీమ్‌లెస్ సర్వీసులను అందజేయడం ఈ సమీకృత స్టేషన్ పునరభివృద్ధిలో భాగం.ఈపీసీ మొడల్‌లో టెండర్లను ఖరారు చేశారు. ఇవీ సదుపాయాలు.. - ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సాఫీగా ప్రయాణం చేసేలా స్టేషన్ పునరభివృద్ధి చేపట్టనున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో తదితర ప్రజారవాణా మార్గాల్లో ప్రయాణికులు స్టేషన్‌కు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీని పెంచడం ప్రధాన లక్ష్యం. పార్కింగ్ ఇబ్బందులను తొలగిస్తారు. - స్టేషన్ పరిసరాల్లో ఎలాంటి రద్దీ లేకుండా నియంత్రించి ఆ స్థలాల్లో షాపింగ్‌మాల్స్,ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తారు. కొత్త స్టేషన్ భవనంలో ఉత్తరం వైపు జీ+3 అంతస్థులు, దక్షిణం వైపు జీ+3 అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉత్తరం వైపు మలి్టలెవల్ పార్కింగ్ సదుపాయం ఉంటుంది, దక్షిణం వైపు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. - రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా 7.5 మీటర్ల వెడల్పుతో 2 నడక దారులను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్లకు చేరుకొనేందుకు స్కైవేలను అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లకు పూర్తిగా పైకప్పులు వేస్తారు. స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరు వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. మరోవైపు స్టేషన్లో సుమారు 5000 కిలోవాట్స్ పవర్ సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
‘విమానాశ్రయం’పై ఉత్కంఠ.!
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏయిర్‌ఫోర్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించి బృందాన్ని క్షేత్రస్థాయి పర్యటనకు పంపనుండగా, మరోవైపు జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారులు విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి రూట్‌మ్యాప్‌లు ఖరారు చేసి రెడీగా ఉంచడంతో మరింత ఆసక్తి నెలకొంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఏఏఐ అధికారుల బృందం సభ్యులు హైదరాబాద్ నుంచి జిల్లాకు రానున్నట్లు అధికారులకు సమాచారం. సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఎయిర్‌పోర్టు విస్తరణలో సాంకేతిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడంతో పాటు వైమానిక శిక్షణ కోసం వినియోగిస్తున్న బేస్‌క్యాంప్‌ను పరిశీలన చేయనున్నారు. అందుబాటులోని స్థలం, బౌండ్రీలు, వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ డిమాండ్, రూట్‌మ్యాప్‌లు తదితర అంశాలను పరిశీలిస్తారు. జిల్లా అధికారుల సహకారం తీసుకోనున్నారు. స్థలాన్ని పరిశీలించనున్న బృందం.. ఆదిలాబాద్‌లో ఇప్పటికే ఎయిర్‌బేస్ ఉంది. దీనిని పౌర విమానయాన సేవలకు తీర్చిదిద్దేందుకు రెండు విడతల్లో తొమ్మిది వందల ఎకరాలకుపైగా అవసరం అవుతుందని ప్రభుత్వం ఇది వరకే లెక్కలు వేసింది. అయితే విమానశ్రయం ఏర్పాటుకు కావాల్సినంత భూమి అందుబాటులో ఉండడంతో జిల్లా ఎంపికైందని చెప్పవచ్చు. 2014లో జిల్లా అధికారులు చేసిన సర్వే ప్రకారం 1,591.45 ఎకరాల భూమి విమానశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 89.44 ఎకరాలు ఉండగా, ప్రైవేట్ భూమి 1502.01 ఎకరాలు ఉన్నట్లు తేలింది. పట్టణానికి అనుకొని ఉన్న ఖానాపూర్ శివారులో ప్రభుత్వ భూమి 50.20 ఎకరాలు, అనుకుంట గ్రామ శివారులో 34.04 ఎకరాలు, తంతోలి శివారులో 5.20 ఎకరాలు ఉంది. ప్రైవేట్ భూమి ఖానాపూర్ శివారులో 431.36 ఎకరాలు, అనుకుంట శివారులో 501.34 ఎకరాలు, కచ్కంటి శివారులో 313.24 ఎకరాలు, తంతోలి గ్రామ శివారులో 256.07 ఉన్నట్లు అప్పట్లో సర్వే ద్వారా నిర్థారించారు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ భూమిని కలుపుకొని మొత్తం 1591.45 ఎకరాలు ఉన్నట్లు తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఏర్పాటుకు జిల్లా అనుకూలం.. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయానికి వాయుమార్గంలో 150 కి.మీ. పరిధిలో కొత్తగా ఏయిర్‌పోర్టులు నిర్మించబోమని గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు 300 కి.మీ.లకుపైనే ఉంది. దీంతో ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు అనుకూలించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వరకే జిల్లా అధికారుల బృందం విమానశ్రయ ఏర్పాటుకు జిల్లా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నట్లు నిర్థారించి ప్రభుత్వానికి నివేదించింది. దీంతోపాటు అప్పట్లో ఏయిర్‌ఫోర్స్ అధికారులు జిల్లాకు వచ్చి స్థలాన్ని పరిశీలన చేశారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్ – నాగ్‌పూర్ రెండు నగరాల మద్యలో జిల్లా ఉండడం, ఏర్పాటుకు కావాల్సిన స్థలం అందుబాటులో ఉండడం, ఇది వరకే ఓ మిలిటరీ ఏయిర్‌బేస్ ఉండడం లాంటివి ఏర్పాటుకు కలిసివస్తున్నట్లు చెప్పవచ్చు. ఏఏఐ నివేదికపైనే ఆశలు.. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పథకం ఉడాన్ కింద రాష్ట్రంలో ఆరు విమానశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మహాబూబ్‌నగర్, కొత్తగూడెంలలో విమానశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఎయిర్‌పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు ఏఏఐ బందంని జిల్లాలకు పంపిస్తోంది. ఇక్కడ పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. అయితే పరిశీలనలో తెలుసుకున్న అంశాలు, ఏఏఐ బృందం రూపొందించే నివేదికపైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. అన్ని కోణాల్లో పరిశీలన చేసి విమానశ్రయ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు బృందం నిర్థారిస్తే జిల్లాకు విమానయోగం కలుగనుంది. -
నీళ్లే లేవు-విమానమేల?
* బీళ్లుగా మారిన పంట పొలాలు * కుప్పంలో పనుల్లేక వలసపోతున్న జనం * ఎయిర్పోర్ట్ ఏర్పాట్లలో అధికారులు బిజీ * సర్వేల కోసం నిధులు ఖర్చుపెడుతున్న వైనం కుప్పం: సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. సమస్య పరిష్కరించి వారికి అండగా నిలవాల్సిన సీఎం చంద్రబాబునాయుడు, అధికార యంత్రాంగం విమానాశ్రయ ఏర్పాటు పనుల్లో నిమగ్నం కావడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే వర్షాలు లేక పనులు దొరక్క వేలాది కుటుంబాలు వలసబాట పట్టాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. గుక్కెడు నీళ్లిచ్చి, పనులు కల్పించి బతుకుదారి చూపుతారనే ఆశతో కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం కనిపించడం లేదు. సర్వేల కోసం నిధుల మంజూరు కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ స్థలం సర్వే చేసేందుకు రూ.14 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రామకుప్పం మండలం అమ్మేరుపేట, కీలకపాడు గ్రామాలకు సంబంధించిన స్థలాలను ఎంపిక చేశారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కుప్పం నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అధికారుల రికార్డుల మేరకు 210 గ్రావూల్లో నీటిసవుస్య తీవ్రంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నాలుగేళ్లుగా వర్షాలు పడకపోవడంతో కుప్పం కరువు కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గంలోని 570 చెరువులు పూర్తిగా ఎండిపోయూయి. కుప్పంలో 2.55 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 21 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగునీరు లేక 80 శాతం భూములు బీళ్లుగా మారాయి. ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో నీళ్లు కావాలంటే 1250-1500 అడుగుల లోతు వరకు బోరు వేయాల్సిందే. కూలి పనుల కోసం నిత్యం కుప్పం నుంచి బెంగళూరుకు 18 వేల వుంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి కరువు పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో వివూనాశ్రయూలు నిర్మించే పనిలో పడింది. రెండు గ్రామాలు ఖాళీ విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన స్థలం వల్ల రెండు గ్రావూల ప్రజల జీవితాలు కష్టాల్లో పడనున్నాయి. 30 ఏళ్ల క్రితం బడుగు, బలహీన వర్గాల కోసం అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుతో భూములను స్వాధీనం చేసుకోనుంది. విమానాశ్రయం అవసరమా? కుప్పం ప్రాంతంలో పండుతున్న పంటలను ఎగుమతి చేసేందుకు డెమో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం కుప్పం లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులంతా వ్యవసాయుం వదలి పనుల కోసం పట్టణాలకు తరలి వెళుతున్నారు. వ్యవసాయు బోర్లు ఎండిపోయాయి. నీటి సౌకర్యంపై దృష్టి పెట్టకుండా విమానాశ్రయం అవసరమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.