Airport entry
-
విమానాశ్రయాల్లోకి నో ఎంట్రీ.. నిజమేనా?
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో ఒకటే ఎయిర్ పోర్టుల్లోకి నో ఎంట్రీ వార్త. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లోకి ప్రవేశంపై నిషేధం విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఒక పోస్ట్ చేసింది. "ఫేక్ న్యూస్ అలర్ట్. భారతదేశం అంతటా విమానాశ్రయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయి. ఆ వార్తులు ఫేక్. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు" అని పేర్కొంది.ఎయిర్‌పోర్టులకు ముందే చేరుకోవాలిభద్రతా తనిఖీల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని పలు విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ఐడీ కార్డులను వెంట తీసుకెళ్లాలని సూచించాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో మెరుగైన భద్రతా చర్యల కారణంగా, ప్రయాణానికి కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఆకాాశ ఎయిర్ లైన్స్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్పైస్ జెట్ కూడా ఇదే విధమైన అడ్వైజరీని జారీ చేసింది. 🛑 Fake News AlertSocial media posts are claiming that entry to airports across India banned#PIBFactCheck:❌ This claim is #FAKE✅ Government has taken no such decision pic.twitter.com/MoaUcQqO2d— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025 -
విమాన ప్రయాణం.. డిజిటల్ మయం!!
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్, ఆధార్ ఉంటే చాలు ఇక విమానయానాన్ని సులభంగా చేసేయెచ్చు. మరి టికెట్ అవసరం లేదా? అని మీకు డౌట్ రావొచ్చు. టికెట్ తప్పనిసరి. అయితే ఫోన్, ఆధార్ సాయంతో ఎయిర్ ట్రావెల్‌ను డిజిటలైజ్ చేయాలని కేంద్రం భావిస్తోంది. అంటే ఇక్కడ కాగితంతో పనిలేదు. అన్నీ డిజిటల్ అన్నమాట. ఎయిర్పోర్ట్ ఎంట్రీ, టికెట్ వంటివన్నీ డిజిటలైజ్ అవుతాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ ‘డిజి యాత్ర’ కార్యక్రమంలో భాగంగా బోర్డింగ్ పాస్, సెక్యూరిటీ ఇంటరాక్షన్స్‌ను డిజిటల్ చేయాలని ప్రయత్నిస్తోంది. పూర్తి విమాన ప్రయాణాన్ని డిజిటలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ‘ప్రయాణికుల పేమెంట్స్, బోర్డింగ్, సెక్యూరిటీ ఇంటరాక్షన్స్ అన్నీ కూడా డిజటల్‌మయం అవుతాయి. కాగితంతో ఎలాంటి అవసరం ఉండదని, ప్రయాణికులను అధికారులు ఆధార్, పాస్‌పోర్ట్ తదితరాల ద్వారా గుర్తిస్తారని తెలిపారు. కొన్ని నెలల్లో అనుకున్నవన్నీ కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సిన్హా మాట్లాడారు. నో–ఫ్లై లిస్ట్‌ను కూడా తీసుకువచ్చే ఆలోచనలో ఉందన్నారు. అంటే ఎవరైనా వికృత చేష్టలకు పాల్పడటం, అతిగా ప్రవర్తించడం వంటివి చేస్తే.. విమానంలోని ఇతర ప్రయాణికులు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి వారి ప్రయణాన్ని రద్దు చేస్తారు. వారి పేర్లను ఈ నో–ఫ్లై జాబితాలో ఉంచుతారు.