airport staff
-
ఐపీఎస్ అధికారి సూట్ కేస్ చూసి షాక్ తిన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది!
Airport Security Opens IPS Officer Suit Case: నిజానికి చాలా పన్నీ ఇన్సిడెంట్లను చూస్తే కాస్త ఆశ్చర్యంగానూ, కామెడిగానూ ఉంటుంది. పైగా కొంతమంది అమాయకంగా చేస్తారో లేక సరదాగా చేస్తారో తెలియదు గానీ కొన్ని ఇషయాలు చాలా ఫన్నీగా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే జైపూర్‌లో చోటు చేసుకుంది. వివారల్లోకెళ్తే.. జైపూర్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఒక ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా సూట్‌కేస్‌ని తెరిచి చూపించాల్సిందిగా కోరారు. భద్రతా దృష్ట్యా విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది బ్యాగ్‌లను ఓపెన్ చేయమని చెబుతుంటారు. ఆ విధంగా ఆ ఐపీఎస్ అధికారి సూట్‌కేస్‌ని ఓపెన్ చేయమని అడిగారు. అయితే అరుణ్ బోత్రా తన సూట్ కేస్ ఓపెన్ చేయగానే సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అక్కడంతా ఒకేటే నవ్వులు. ఇంతకీ ఆ సూట్‌కేస్‌లో ఏమున్నాయంటే పచ్చి బఠాణిలు. సూట్‌కేస్ మొత్తం బఠాణిలతో నిండి ఉంది. అయితే ఆయన ఆ బఠాణిలను కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన" జైపూర్ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది నా బ్యాగ్‌ని ఓపెన్ చేయమన్నారు" అనే క్యాప్షన జోడించి మరీ ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలతోపాటు జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆన్లైన్లో తెగ వైరల్‌గా మారింది. Security staff at Jaipur airport asked to open my handbag 😐 pic.twitter.com/kxJUB5S3HZ — Arun Bothra 🇮🇳 (@arunbothra) March 16, 2022 (చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో చైనా.. ఈసారి ఏం చేసిందంటే..?) -
భారతీయులకు చైనాలో అవమానం
బీజింగ్: భారతీయ ప్రయాణికులను చైనాలోని ఓ విమానాశ్రయ సిబ్బంది అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నమ్ సింగ్ చహల్ ఆగస్టు 6న ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లడానికి చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కారు. చైనాలోని పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం విమానం నుంచి దిగుతున్న భారతీయులను అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది దుర్భాషలాడారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సంబంధిత ఎయిర్‌లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా..వారు తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని చహల్ వాపోయారు. -
సీఎం వస్తారని హడావుడి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వస్తారని సమాచారం రావడంతో అధికారులు హడావుడి చేశారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం వెళ్లిన ఆయన.. వర్షం కారణంగా హెలికాప్టర్ వీడి రోడ్డుమార్గంలో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వస్తారని సమాచారం అందింది. దీంతో ఇక్కడి అధికారులు ఆయన కోసం కాన్వాయ్‌ను సిద్ధం చేసి, భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, సీఎం కొవ్వూరు వరకూ వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రూజెట్, జెట్ విమానాలు ఆలస్యం మధురపూడి : వాతావరణ మార్పుల ఫలితంగా విమాన ప్రయాణాలకు మంగళవారం ఆటంకం ఏర్పడింది. ట్రూజెట్, జెట్ విమాన సర్వీసలు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఆలస్యంగా చేరాయి. సాయంత్రం 4.20 గంటలకు చేరాల్సిన ట్రూజెట్ విమానం మూడు గంటలు, 5.30 గంటలకు రావాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానం గంటన్నర ఆలస్యంగా నడిచాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయం ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాలు హైదరాబాద్‌లో నే ఆలస్యంగా బయలుదేరాయి. సాయంత్రం వేళ వర్షాలు కురుస్తూండడంతో రెండు రోజులుగా ఈ రెండు విమానాలు ఆలస్యంగానే వస్తున్నాయి. -
కరిపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పులు
సీఐఎస్ఎఫ్ జవాను మృతి, మరొకరికి గాయాలు కోజికోడ్(కేరళ): కోజికోడ్ దగ్గర్లోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ జవాన్లకు, ఎయిర్పోర్ట్ సిబ్బందికి మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఇది కాల్పులకు దారితీయడంతో ఓ జవాను మృతిచెందాడు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణతో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు గురువారం ఉదయం నుంచి సర్వీసులను పునరుద్ధరించారు. ఈ పరిణామాలపై కేరళ హోంమంత్రి రమేశ్ విచారణకు ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి చెందిన అగ్నిమాపకదళ అధికారిని సోదా చేసే క్రమంలో తలె త్తిన వాదన ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ జైపాల్ యాదవ్ చనిపోయినట్లు పేర్కొన్నారు. ఘటన తర్వాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీలతో ప్రయాణికులను కొట్టి, విమాన సర్వీసులను అడ్డుకున్నారని సాక్షులు తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో ప్రైవేట్ సంస్థ సిబ్బంది ఆందోళన
శంషాబాద్, న్యూస్‌లైన్: కనీస వేతనాలు పెంచాలంటూ శంషాబాద్ విమానాశ్రయంలోని ‘స్కై గవర్‌మెట్’ ఆహార సంస్థకు చెందిన సుమారు 180 మంది సిబ్బంది ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆందోళన దిగారు. పలు ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెందిన విమానాలకు ఆహారాన్ని సరఫరా చేసే ఈ సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని ఆదివారం సిబ్బంది యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం నిరాకరించడంతో అదే రోజు అర్ధరాత్రి సంస్థ గేటు ఎదుట బైఠాయించారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి వారిని పంపించేశారు. సోమవారం ఉదయం బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ కన్వీనర్ నందకిశోర్, సీఐటీయూ రాజేంద్రనగర్ నాయకులు సత్యనారాయణరెడ్డి, మల్లేష్‌ల ఆధ్వర్యంలో కార్మికులు శంషాబాద్ తహసీల్దార్ లచ్చిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. విమానాశ్రయంలోని అనేక కాంట్రాక్టు సంస్థలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలను అమలు చేయకుండా సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని కార్మికులు తెలిపారు. అక్కడి నుంచి కార్మికులు యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఎయిర్‌పోర్టులోని స్కైగవర్మెట్ కార్యాలయానికి వెళ్లారు. తొలుత కార్మికులతో మాట్లాడడానికి యాజమాన్యం నిరాకరించడంతో గేటు ఎదుట బైఠాయించి తమ ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిలిచిపోయిన ఆహార సరఫరా కార్మికులు స్కై గవర్‌మెట్ సంస్థ గేటులోంచి వాహనాల రాకపోకలకు అడ్డుకోవడంతో విమానాల్లోని ప్రయాణికుల కోసం సరఫరా చేసే ఆహారం నిలిచిపోయింది. దీంతో కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ముందస్తుగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేముందే ఆహారాన్ని డబుల్ పార్సిల్స్ తీసుకొచ్చే పరిస్థితి తలెత్తింది. కొన్ని విమానాలకు స్కైచెఫ్ సంస్థ నుంచి ఆహారాన్ని సరఫరా చేశారు. పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుండడంతో శంషాబాద్ జోన్ ఇన్చార్జి డీసీపీ నారాయణ, ఏసీపీ భద్రేశ్వర్, సీఐ దుర్గాప్రసాద్‌లు కార్మికులతో మాట్లాడారు. సంస్థకు సంబంధించిన వాహనాల రాకపోకలకు పునరుద్ధరించారు. స్కై గవర్మెంట్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించారు.