భారతీయులకు చైనాలో అవమానం | Indians are insulted in China | Sakshi
Sakshi News home page

భారతీయులకు చైనాలో అవమానం

Published Mon, Aug 14 2017 2:09 AM | Last Updated on Tue, Sep 12 2017 12:00 AM

Indians are insulted in China

బీజింగ్‌: భారతీయ ప్రయాణికులను చైనాలోని ఓ విమానాశ్రయ సిబ్బంది అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సత్నమ్‌ సింగ్‌ చహల్‌ ఆగస్టు 6న ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లడానికి చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కారు.

చైనాలోని పుడాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం విమానం నుంచి దిగుతున్న భారతీయులను అక్కడి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది దుర్భాషలాడారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సంబంధిత ఎయిర్‌లైన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేయగా..వారు తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని చహల్‌ వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement