స్కూల్ కు వెళ్లలేదని కొడుకుని చంపిన తండ్రి!
స్కూల్ కు వెళ్లడం లేదని ఆగ్రహించిన తండ్రి తన పదేళ్ల కుమారుడిని చంపేసిన సంఘటన థానేలో సంచలనం రేపింది. థానే జిల్లాలోని అంబర్ నాథ్ పట్టణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా స్కూల్ కు ఎందుకు వెళ్లడం లేదని, ఎందుకు చదవడం లేదని పదేళ్ల సాజిద్ ను తండ్రి అజిత్ మజిద్ ఖాన్ ప్రశ్నించినట్టు సమాచారం.
అయితే కుమారుడు నుంచి ఎంతకు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహించిన మజిద్ ఖాన్ కర్రతో సాజిద్ తలపై పలుమార్లు కొట్టినట్టు పోలీసులు తెలిపారు.
తలకు గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆతర్వాత పరిస్థితి విషమించడంతో థానే సివిల్ ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా తుది శ్వాస విడిచారని శివాజీ నగర్ ఇన్స్ పెక్టర్ డీఎస్ గెవాడే తెలిపారు. నిందితుడు మజిద్ ఖాన్ ఐదుగురు భార్యలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మృతుడు సాజిద్ తల్లి ఐదేళ్ల క్రితమే భర్తకు దూరంగా ఉంటున్నట్టు స్థానికులు వెల్లడించారు. కాని సాజిద్ తన తండ్రితోనే ఉంటున్నట్టు తెలిసింది. సాజిద్ మృతికి కారణమైన మజిద్ ఖాన్ పై సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు.