అమితాబ్ నిర్మాణంలో సౌత్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమా పై ఆసక్తికరమైన వార్త ఒకటి కోలివుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అజిత్ హీరోగా తేరి ఫేం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన సొంత నిర్మాన సంస్థ అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ బ్యానర్ పై నిర్మించనున్నాడట. ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోయినా ఈ కాంబినేషన్ పై వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి.
గతంలో కూడా అజిత్ హీరోగా ఓ సినిమా తమిళ సినిమాను నిర్మించాడు బిగ్ బి. అజిత్, విక్రమ్, మహేశ్వరిలు ప్రదాన పాత్రల్లో తెరకెక్కిన ఉల్లాసం సినిమాను నిర్మించాడు బిగ్ బి. ఈ సినిమా విజయం సాధించకపోవటంతో తరువాత సౌత్ సినిమాను నిర్మించే ప్రయత్నం చేయలేదు. దాదాపు 19 ఏళ్ల తరువాత మరోసారి అమితాబ్ సౌత్ లో సినిమాలో సినిమాను నిర్మించనుండటంతో ఈ సినిమా కోసం బాలీవుడ్ మీడియా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.