కేసీఆర్‌తో ఏసీబీ డీజీ కీలక భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఓటుకు నోటు వ్యవహారంపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి పాత్రధారి మాత్రమేనని... సూత్రధారి అంతా టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడే అని వెల్లడైనట్లు సమాచారం.
నామినేటేడ్ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో ఆర్థిక వనరులను సమకుర్చేందుకు చంద్రబాబు ప్రధాన పాత్ర పోషించారన్న అంశంపై ఈ సందర్బంగా చర్చకు వచ్చింది. అదికాక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే దిశగా చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని రాజకీయా పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ తో ఇంటిలిజెన్స్ ఐజీ, ఏసీబీ డీజీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.