హైదరాబాద్‌ను గెలిపించిన భండారి
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు 46 పరుగుల తేడాతో రైల్వేస్ జట్టుపై గెలుపొందింది. లెగ్‌స్పిన్నర్ ఆకాశ్ భండారి (5/52), మెహదీహసన్ (3/83) హైదరాబాద్‌ను గెలిపించారు. తొలిరోజు ఆటలో హైదరాబాద్ 294 పరుగులు చేయగా... శుక్రవారం రెండో రోజు ఆటలో రైల్వేస్ 84.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌటైంది. అరిందమ్ ఘోష్ (79), సౌరవ్ వాకస్కర్ (54) అర్ధసెంచరీలు సాధించారు. మిగతా బ్యాట్స్‌మెన్ భండారి స్పిన్ ఉచ్చులో పడ్డారు.