నిజాయితి చాటుకున్న ఇద్దరు ఎన్నారైలు
దుబాయ్‌లో ఇద్దరు ఎన్నారైలు బిజూ కృష్ణ కుమార్ పిళ్లై విజయన్, సోని థామస్‌లు తమ నిజాయితీని చాటుకున్నారు. దుబాయ్‌లో ఇటీవల అల్ ఖలిదీయా వీధిలో నడిచి వెళ్లున్న ఆ ఇద్దరు ఎన్నారైలకు రూ. 60 వేల దినార్హులు ( రూ.16,335 యూఎస్ డాలర్లు) దొరికాయి. ఆ నగదును వారు సమీపంలోని పోలీసు స్టేషన్లో అందజేశారు. పోలీసులు అసలు వ్యక్తికి ఆ నగదును అందజేశారు. దుబాయ్ మీడియా ఆ విషయాన్ని ప్రచురించింది. ఎన్నారైల నిజాయితీని దుబాయి ప్రభుత్వం అచ్చెరువొందింది.
దాంతో ఇద్దరు ఎన్నారైలను సన్మానించాలని ప్రభుత్వం సంకల్పించింది. దాంతో బీజు కృష్ణ, సోని థామస్‌లను దుబాయ్ ప్రభుత్వం అబూ దాబిలో బుధవారం ఘనంగా సన్మానించింది. యూఏఈ డిప్యూటీ ప్రధానితోపాటు పలువురు ఉన్నతాధికారులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.