alampur ci
-
సోదరి హత్య కేసులో వ్యక్తి అరెస్టు
అలంపూర్: ఓ మహిళకు పెళ్లి అయింది.. కుమారుడు కూడా ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెబితే కుటుంబీకులు అంగీకరించలేదు. అయినా, ఆమె ఆ వ్యక్తినే పెళ్లాడింది. మర్నాడు ఒంటరిగా ఇంటికి వచ్చిన ఆమెను సోదరుడు హత్య చేశాడు. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించగా మృతి చెందడంతో ఆత్మహత్యగా చిత్రీకరించాడు. అయితే పోలీసుల విచారణలో కులం కాని వ్యక్తిని పెళ్లాడటం ఇష్టం లేక సోదరుడే ఆమెను హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ రజితారెడ్డి, ఎస్ఐ జయశంకర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన ఇందిర (45) అనే మహిళ భర్త మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత ఆమె కర్నూలులో ఉంటున్న అలంపూర్ వాసి మహేశ్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అతడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని కుటుంబ సభ్యులకు చెబితే మహేశ్‌ది వేరే కులం కావడంతో ఇంట్లో ఈ వివాహాన్ని నిరాకరించారు. దీంతో ఇందిర ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఈ ఏడాది ఆగస్టు 29వ తేదీన మహేశ్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇందిర ఆగస్టు 30వ తేదీన ఇంటికి వచ్చింది. ఇది జీర్ణించుకోలేని ఇందిర తమ్ముడు కాలూరి లోకేశ్, అదే రోజు రాత్రి 3 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా ఇందిరపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కొన ఊపిరితో ఉన్న ఆమె తలపై కట్టెతో బలంగా కొట్టి హత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాడు. ఆత్మహత్య చేసుకున్నట్లుగానే పేర్కొంటూ ఆగస్టు 31వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ విచారణలో ఇందిరను లోకేశ్ హత్య చేసినట్లు తేలింది. దీంతో శుక్రవారం లోకేశ్‌ను అరెస్టు చేసి అలంపూర్ కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ, ఎస్ఐ వెల్లడించారు. -
పేకాటలో గొడవతోనే యువకుడి హత్య
శాంతినగర్ : పేకాటలో జరిగిన గొడవతోనే ఓ యువకుడిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు వివరాలను బుధవారం సాయంత్రం రాజోలి పోలీస్‌స్టేషన్‌లో అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. వడ్డేపల్లి మండలం రాజోలికి చెందిన అమీర్ (32) వ్యసనపరుడు. పేకాట ఆడటానికి డబ్బులు అప్పు ఇవ్వకుంటే చంపుతానని అదే గ్రామానికి చెందిన నాయికి చంద్రను, పొలం వద్ద జరిగిన గొడవలో చంపుతానని యూనుస్‌ను బెదిరించాడు. దీంతో అతడిని ఎలాగైన తుదముట్టించాలని ఇద్దరూ కలిసి పథకం వేసుకున్నారు. ఇందులోభాగంగా ఈనెల 21వ రాత్రి ఎనిమిది గంటలకు మటన్‌మార్కెట్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద ఉన్న అమీర్‌ను మారణాయుధాలతో దాడికి పాల్పడి చంపేసి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను బుధవారం పట్టుకుని విచారించి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో శాంతినగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, రాజోలి హెడ్‌కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుళ్లు తులసీనాయుడు, చిన్నికృష్ణ, మన్యం పాల్గొన్నారు. -
రోడ్డుభద్రతానిబంధనలు పాటించాలి
అలంపూర్ : వాహనదారులు రోడ్డు భద్రతానిబంధనలు తప్పక పాటించాలని అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. అలంపూర్ చౌరస్తాలోని ఆటో, జీపు డ్రై వర్లతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో కృష్ణా పుష్కరాలు జరగనుండటంతో ముందస్తుగా వారికి అవగాహన కల్పించారు. పుష్కరాలకు వాహనాల సంఖ్య అధికంగా ఉంటుందని జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. పరిమితికి మించే ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు. రోడ్లపై వాహనాలు ఒక పద్దతిలో నిలుపుకోవాలని అది సూచించిన ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అన్నిధ్రువపత్రాలను సరి చూసుకోవాలని డ్రై వసూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మానవపాడు ఎస్ఐ భగవత్ రెడ్డి, స్థానిక పోలీసులు ఉన్నారు.