రోడ్డుభద్రతానిబంధనలు పాటించాలి
అలంపూర్ : వాహనదారులు రోడ్డు భద్రతానిబంధనలు తప్పక పాటించాలని అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. అలంపూర్ చౌరస్తాలోని ఆటో, జీపు డ్రై వర్లతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో కృష్ణా పుష్కరాలు జరగనుండటంతో ముందస్తుగా వారికి అవగాహన కల్పించారు. పుష్కరాలకు వాహనాల సంఖ్య అధికంగా ఉంటుందని జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. పరిమితికి మించే ప్రయాణికులను ఎక్కించుకోవద్దన్నారు. రోడ్లపై వాహనాలు ఒక పద్దతిలో నిలుపుకోవాలని అది సూచించిన ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అన్నిధ్రువపత్రాలను సరి చూసుకోవాలని డ్రై వసూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మానవపాడు ఎస్‌ఐ భగవత్ రెడ్డి, స్థానిక పోలీసులు ఉన్నారు.