Alipur
-
Delhi: 11 మంది సజీవ దహనం
ఢిల్లీ, సాక్షి: దేశ రాజధాని ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. అలీపూర్‌లో ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి మంటలు చెలరేగగా.. పదకొండు మంది మృతి చెందారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ.. మరికొందరి ఆచూకీ లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అలీపూర్ దయల్పూర్ మార్కెట్లో గురువారం సాయంత్రం ఓ పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగగా.. అవి చుట్టుపక్కల ఇళ్లకు, దుకాణాలకు సైతం వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించారు. India's Capital Delhi Fire in paint factory, seven fatalities reported in Alipur blaze, chilling video emerges.#Delhifire #NarelaFire #Alipur #FIRE#คริสสิงโต 🎥ANI pic.twitter.com/IlTWr5Kw5V — Diplomat Times (@diplomattimes) February 15, 2024 సాయంత్రం 5 గం. ప్రాంతంలో తమకు సమాచారం అందిందని.. రాత్రి 9గం. వరకు మంటలు అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఒకరు తెలిపారు. మంటల్ని 22 ఫైరింజన్ల సాయంతో అతి కష్టం మీద అధికారులు అదుపు చేసినట్లు తెలిపారాయన. ఆపై కాలిన స్థితిలో పలు మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చినా.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. #WATCH | On the Alipur fire incident, Director of Delhi Fire Services, Atul Garg says, "At around 5:25 pm, we got a call that a fire broke out in a paint factory. Six fire tenders were sent to the spot. We were able to control the fire in 4 hours but 11 people have lost their… pic.twitter.com/mbQKwYwWzn — ANI (@ANI) February 16, 2024 పెయింట్ పరిశ్రమలో తొలుత పేలుడు సంభవించి.. మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని రసాయనాల వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒక కానిస్టేబుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. दिल्ली: नरेला के भोरगढ़ औद्योगिक क्षेत्र में एक फैक्ट्री में आग लगी. अलीपुर, नरेला के मुख्य बाजार में आग लगने से 7 लोगों की मौत..#Delhi #Alipur #FIRE #Fireaccident pic.twitter.com/httDhGForI — Surbhi Bhawsar (@SurbhiBhawsar9) February 15, 2024 -
ఫ్లిప్‌కార్ట్ హబ్ నుంచి 150 మొబైల్స్ చోరీ
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 150 మొబైల్స్ చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఢిల్లీ శివార్లలోని అలీపూర్ ఫ్లిప్‌కార్ట్ డెలివరీ హబ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఫ్లిప్‌కార్ట్ హబ్ సెక్యూరిటీ అధికారి మాన్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిబ్రవరి 19వ తేదీన మొబైల్ ఫోన్లను డెలీవరి హబ్ నుంచి బిలాస్‌పూర్‌లోని వేర్‌హౌస్‌కు తరలించే క్రమంలో ఈ చోరీ జరిగినట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాన్సింగ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ముఠా నాయకుడు సంతోష్‌తో పాటు బ్రీజ్‌మోహన్, అఖిలేశ్, రంజిత్‌లు ఉన్నారు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నివాసం ఉంటున్న నిందితులు.. పలు ట్రాన్స్పోర్ట్ కంపెనీలలో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి వివిధ కంపెనీలకు చెందిన 30 కొత్త ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ కేసులో సంతోష్, బ్రీజ్‌మోహన్‌లపై అక్కడి ఫర్సత్ గంజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయిందని తెలిపారు. -
అలీపుర్లో కిసాన్ మండీ
► ఏపీఎంసీతో సంబంధం లేకుండా దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు ► లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ ►రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడ నేరుగా విక్రయించుకోవచ్చు ►గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్న కన్సార్షియం సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ) పరిధిలో కాకుండా స్వతంత్రంగా అలీపూర్‌లో కిసాన్ మండీ ఏర్పాటవుతోంది. ఆకాశాన్నంటుతోన్న పళ్లు, కూరగాయల ధరల నుంచి నగరవాసులకు ఊరటనివ్వడం కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఎంసీతో సబంధం లేకుండా దేశంలోనే ఏర్పాటవుతున్న మొట్టమొదటి కిసాన్ మండీ ఇదే కావడం విశేషం. స్మాల్ ఫార్మ ర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం ఏర్పాటుచేసే ఈ మార్కెట్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. 20 కిలోల ఉల్లిపాయలను సఫల్కు విక్రయించడంతో మండీని లాంఛనంగా ప్రారంభించారు. ఆరు నెలల తరువాత మండీ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. పళ్లు కూరగాయల రైతు లు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారులకు విక్రయించే ఉద్దేశంతో ఈ మార్కెట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. మండీలో దళారుల ప్రమేయం ఉండదని, దీం తో రైతులకు అధిక ధర గిట్టుబాటు కావడమేకాక వినియోగదారులకు తక్కువ ధరలకు పళ్లు, కూరగాయలు లభిస్తాయన్నారు. హర్యానా ఉత్తర సరిహద్దునానుకొని ఉన్న అలీపుర్ గ్రామంలో 1.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ మండీని ఏర్పాటుచేశారు. కిసాన్మండీ పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తరువాత 30 నుంచి 40 వ్యవసాయోత్పత్తుల సంస్థలు, రైతు సంఘాలు తమ ఉత్పత్తుల నమూనాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. మండీ నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం అందిస్తుంది. ఫార్మ్ గేట్ వద్దనే పళ్లు, కూరగాయలను వేరుచేసి, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసే వసతులను కన్సార్షియం సమకూరుస్తుంది.