Alirajpur
-
యుగ పురుషుడు.. ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆ తర్వాత..
ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలీరాజపూర్‌లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు. అనంతరం మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. 15 ஆண்டுகள் 3 பெண்களுடன் லிவிங் டுகெதர்.. 6 குழந்தைகள் முன்னிலையில் நடைபெற்ற திருமணம்..! #MadhyaPradesh | #Alirajpur | #LiveInRelationship pic.twitter.com/lUVxNdwkuX — Polimer News (@polimernews) May 3, 2022 ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి కూడా మౌర్యను అనుమతించలేదని అన్నాడు. కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. Madhya Pradesh: A man living in a live-in relationship with three women entered into a wedlock with all the three in the presence of the entire village. The wedding took place in Nanpur village in the tribal-dominated Alirajpur district. pic.twitter.com/oePIwFb5ss — Free Press Journal (@fpjindia) May 2, 2022 -
మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారు..
భోపాల్: పోలీసుల కస్టడీలో ఉన్న గిరిజన నిందితుల చేత మూత్రం తాగించిన స్టేషన్ సిబ్బంది తీవ్ర అవమానకరమైన చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలోని నన్పూర్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నన్పూర్కు చెందిన ఐదుగురు గిరిజన యువకులను ఓ నేరం కింద అరెస్ట్‌చేసిన పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. కస్టడీలో ఉన్న వారిపై ఖాకీలు లాఠీ ఝుళిపించి.. చితకబాదారు. తీవ్ర గాయలపాలైన యువకులు తాగడానికి మంచినీళ్లు ఇవ్వాల్సిందిగా పోలీసులను వేడుకున్నారు. అయినా కనుకరించని స్టేషన్ సిబ్బంది వారి చేత మూత్రం తాగించి తీవ్ర అవమానానికి గురిచేశారు. ఘటనపై స్పందించిన స్థానిక ఎస్పీ విపుల్ శ్రీవాస్తవ.. ఈ చర్యకు పాల్పడ్డ నలుగురు స్టేషన్ సిబ్బందిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు వివరించారు. దీనిపై మరింత విచారణ జరిపి చట్టపరమమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. గాయపడ్డ ఐదుగురు గిరిజన యువకులకు స్థానిక ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. -
'దిగ్విజయ్ పుట్టుకతోనే మోసగాడు'
అలిరాజ్ పూర్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టుకతోనే దిగ్విజయ్ సింగ్ మోసగాడు అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎల్లప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. వ్యాపం కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన తర్వాత తొలిసారి చౌహాన్ గురువారం సాయంత్రం అలిరాజ్ పూర్ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఒక రైతు కొడుకు ముఖ్యమంత్రి కావడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతల అక్రమాలను ప్రజల సహాయంతో బయటపెడతానని చెప్పారు.