'దిగ్విజయ్ పుట్టుకతోనే మోసగాడు'
అలిరాజ్ పూర్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టుకతోనే దిగ్విజయ్ సింగ్ మోసగాడు అని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఎల్లప్పుడూ దిగజారుడు రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. వ్యాపం కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన తర్వాత తొలిసారి చౌహాన్ గురువారం సాయంత్రం అలిరాజ్ పూర్ జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఒక రైతు కొడుకు ముఖ్యమంత్రి కావడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతల అక్రమాలను ప్రజల సహాయంతో బయటపెడతానని చెప్పారు.