సెమీస్లో సౌరాష్ట్ర
సాక్షి, విజయనగరం: ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన సౌరాష్ట్ర... రంజీ ట్రోఫీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. లెఫ్టార్మ్ సీమర్ జయదేవ్ ఉనాద్కట్ (9/105) మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీయడంతో మూడు రోజుల్లోనే ముగిసిన క్వార్టర్ఫైనల్లో సౌరాష్ట్ర ఇన్నింగ్స్ 85 పరుగులతో విదర్భపై నెగ్గింది. 17/0 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్లో 68.1 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. వసీమ్ జాఫర్ (48) టాప్ స్కోరర్. ఫజల్ (36) మోస్తరుగా ఆడాడు. గత మూడు సీజన్లలో సౌరాష్ట్ర సెమీస్కు చేరడం ఇదే తొలిసారి.
ఇతర మ్యాచ్ల స్కోర్లు:-
అస్సాం తొలి ఇన్నింగ్స్: 323 ఆలౌట్;
పంజాబ్ తొలి ఇన్నింగ్స్: 137 ఆలౌట్; అస్సాం రెండో ఇన్నింగ్స్: 101 ఆలౌట్;
పంజాబ్ రెండో ఇన్నింగ్స్: 224/8 (గురుకీరత్ సింగ్ 64, సిదానా 43, అరూప్ దాస్ 6/82).
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 348 ఆలౌట్; బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 121 ఆలౌట్;
మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్: 338/5 (రజత్ పటిదార్ 137, బుండేలా 72, నమన్ 52).
ముంబై తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్; జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్: 172 ఆలౌట్;
ముంబై రెండో ఇన్నింగ్స్: 245 ఆలౌట్;
జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్: 28/1 (గౌతమ్ 12 బ్యాటింగ్, విరాట్ సింగ్ 4 బ్యాటింగ్).