కుల్నా: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన బంగ్లాదేశ్... ఆదివారం జరిగిన రెండో టి20లోనూ 42 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన బంగ్లా 20 ఓవర్లలో 3 వికెట్లకు 167 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (33 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షబ్బీర్ రెహమాన్ (30 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగారు. తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. మసకద్జా (30) టాప్ స్కోరర్. సిబండా, మసకద్జా తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించినా... వరుస విరామాల్లో వికెట్లను చేజార్చుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్బీర్ రెహమాన్ 3, ముస్తాఫిజుర్ రెహమాన్ 2 వికెట్లు తీశారు.
బంగ్లాదేశ్ విజయం
Published Mon, Jan 18 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM
Advertisement
Advertisement