All flights
-
బంగ్లాదేశ్ ఉద్రిక్తతలతో అలర్ట్ అయిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్కు నడిపించే విమాన సర్వీసులను తక్షణం రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఎయిర్ ఇండియా పోస్ట్ చేసింది. “బంగ్లాదేశ్లో తాజా పరిస్థితుల దృష్ట్యా, ఢాకాకు నడిచే మా విమానాలను తక్షణమే రద్దు చేశాం. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కన్ఫర్మ్ బుకింగ్ ఉన్న ప్రయాణికులకు రీషెడ్యూల్, క్యాన్సిలేషన్ ఛార్జీలపై వన్-టైమ్ మినహాయింపు ఇస్తున్నాం'' అని పేర్కొంది.IMPORTANT UPDATEIn view of the emerging situation in Bangladesh, we have cancelled the scheduled operation of our flights to and from Dhaka with immediate effect. We are continuously monitoring the situation and are extending support to our passengers with confirmed bookings…— Air India (@airindia) August 5, 2024 మరోవైపు.. పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్.. తాజా పరిస్థితుల్ని వివరించినట్లు సమాచారం. ఇక సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు, చొరబాట్లు జరిగే అవకాశాలు ఉండడంతో సైన్యం అప్రమత్తమైంది. అలాగే బంగ్లాలో ఉన్న భారతీయుల కోసం అడ్వైజరీ విడుదల చేసింది. అయితే.. బంగ్లా అల్లర్ల నేపథ్యంలో ఇప్పటికే మెజారిటీ భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. -
పైలట్ల సమ్మె : అన్ని విమానాలు రద్దు
లండన్ : బ్రిటిష్ ఎయిర్లైన్స్ కు భారీ షాక్ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు చెందిన సుమారు నాలుగువేల మంది పైలెట్లు ఉన్నపళంగా సంచలన నిర్ణయం తీసుకోవడంతో భారీ ఇబ్బందుల్లో పడింది. వేతన సవరణకుసంబంధించిన నూతన పారిశ్రామిక విధానాన్ని నిరసిస్తూ బ్రిటిష్ ఎయిర్లైన్స్ సిబ్బంది 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులను రద్దు చేసుకుంది. దాదాపు అన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదని బ్రిటిష్ ఎయిర్వేస్ (బిఎ) సోమవారం (సెప్టెంబర్ 9) ఒక ప్రటనలో తెలిపింది. ప్రయాణికుల అసౌకర్యాన్ని అర్థం చేసుకోగలమని, క్షమించమని వారికి విజ్ఞప్తి చేసింది. నూతన పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో బ్రిటిష్ ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ (బాల్పా) గత నెలలో సమ్మె నోటీసులిచ్చింది. అయినా సంస్థ ముందుకు రాకపోవడంతో సిబ్బంది మొత్తం సమ్మెకు దిగారు. బ్రిటిష్ ఎయిర్లైన్స్ చరిత్రలో పైలట్ల మొట్టమొదటి సమ్మె ఇదే. మరోవైపు ఈ నిర్ణయంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీలైనత త్వరలో ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. సెప్టెంబర్ 9, 10 తేదీలలో సమ్మె తరువాత, సెప్టెంబర్ 27న మరో సమ్మె నిర్వహించనున్నారని సమాచారం. కాగా బ్రిటిష్ ఎయిర్లైన్స్ లాభాలను ఉద్యోగులకు పంచాలని బ్రిటిష్ ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. జూలైలో విమానయాన సంస్థ ప్రతిపాదించిన మూడేళ్లలో 11.5 శాతం వేతన పెంపును బాల్పా తిరస్కరించింది. ఈ సమ్మె ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అవసరమైన పెట్టుబడి కంటే సమ్మె మూలంగా కంపెనీకి చాలా నష్టం వస్తుందని బాల్పా ప్రధాన కార్యదర్శి బ్రియాన్ స్ట్రట్టన్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఉద్యోగుల సమ్మె న్యాయబద్దం కాదని, తాము సరైన ప్రతిపాదనలే చేశామని బ్రిటిష్ ఎయిర్లైన్స్ చెబుతోంది. 90 శాతం విమానయాన కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో రెండు యూనియన్లు 11.5 శాతం పెంపును అంగీకరించాయని కంపెనీ వాదిస్తోంది. ఫైనాన్షియల్ టైమ్స్ సాధారణంగా 48 గంటల వ్యవధిలో 1,700 విమానాలను నడుపుతుంది బ్రిటిష్ ఎయిర్లైన్స్. -
పేలుళ్లకు కొన్ని నిమిషాల ముందు..
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్ పేలుళ్ల ఘటనతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి భారతీయుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటోంది. వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన సిబ్బంది ఒకరు గాయపడ్డారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ట్విట్ చేశారు. జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన భారతీయ మహిళా ఉద్యోగి గాయపడ్డారని, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సుష్మ తెలిపారు. అయితే ఇద్దరు మహిళా సిబ్బంది గాయపడ్డారని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. మరోవైపు పేలుళ్ళ కారణంగా ముంబై నుంచి బ్రస్సెల్స్ వెళ్లే అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. జెట్ ఎయిర్ వేస్ కూడా తన విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బ్రస్సెల్స్ నుంచి ఢిల్లీ, ముంబై , టొరంటో తదితర నగరాలకు మార్చి 22 వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. తమ సిబ్బంది, ఇతర ప్రయాణికుల యోగక్షేమాలను విచారిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపింది. పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందే న్యూఢిల్లీ, ముంబై నుంచి జెట్ ఎయిర్ వేస్ కు చెందిన రెండు విమానాలు బ్రస్సెల్స్ చేరుకున్నాయి. బాంబు పేలుళ్ల ఘటనలో ఈ విమాన ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ పేలుళ్ల నేపథ్యంలో దేశంలో అన్ని విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్ లలో హై ఎలర్ట్ ప్రకటించారు. విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.