all hospitals
-
ఆస్పత్రుల్లో స్వైపింగ్ మిషన్లు
అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోమ్స్, డయాగ్నస్టిక్ కేంద్రాలు, మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా స్వైపింగ్ మిషన్లు/పీఓసీ యంత్రాలు పెట్టుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, బ్యాంక్ మేనేజర్లు, రెవిన్యూ డివిజన్ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీకి దరఖాస్తు చేసుకుని ఆ మిషన్లు పొందాలని సూచించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా యజామాన్యాలు 24 గంటల్లోగా వాటిని అమర్చుకోవాలని ఆదేశించారు. -
అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలి
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మహేందర్రెడ్డి జగిత్యాల జోన్ :హెల్త్కార్డుల ద్వారా ఉపాధ్యాయులకు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జాలి మహేందర్రెడ్డి కోరారు. జగిత్యాల పట్టణంలో యూనియన్ సమావేశం అదివారం జరిగింది. మహేందర్రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై నేల రోజులు దాటినా చాల పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు రాలేదని తెలిపారు. ఉపా«ధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎన్నం నర్సింహారెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు యాళ్ల అమర్నాథ్రెడ్డి, సత్యనారాయణ, శ్రీకాంత్రావు, రాజేశ్, ఏవీఎన్.రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.