అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్స్, డయాగ్నస్టిక్ కేంద్రాలు, మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా స్వైపింగ్ మిషన్లు/పీఓసీ యంత్రాలు పెట్టుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, బ్యాంక్ మేనేజర్లు, రెవిన్యూ డివిజన్ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీకి దరఖాస్తు చేసుకుని ఆ మిషన్లు పొందాలని సూచించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా యజామాన్యాలు 24 గంటల్లోగా వాటిని అమర్చుకోవాలని ఆదేశించారు.