స్కోడా ఆక్టావియా లాంచ్.. ధర
న్యూఢిల్లీ: చెక్ రిపబ్లిక్కు చెందిన కార్ల తయారీ కంపెనీ స్కొడా కొత్త సెడాన్ ఆక్టావియా ను లాంచ్ చేసింది. భారతదేశంలో అత్యుత్తమంగా అమ్ముడుపోయిన సెడాన్ ఆక్టవియా కొత్త వెర్షన్‌ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 15.49 లక్షల( ఆల్ ఇండియా ఎక్స్ షోరూం ధరలు) నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిపింది..
పెట్రోల్ డీజిల్ ఇంజిన్ రెండు వెర్షన్లలో ఈ కారు అందుబాటులో ఉండనుంది. ముఖ్యంగా పెట్రోల్ లో 1.4 లీటర్, 1.8 లీటర్ల రెండు ఇంజిన్ ఎంపికలతో రూ. 15.49-20.89 లక్షల మధ్య ధరకే లభిస్తుంది. డీజిల్ 2-లీటర్ ఇంజన్‌తో నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది. వీటి రూ .16.9-22.89 లక్షల మధ్య ఉంటాయని కంపెనీ ప్రకటించింది.
స్కొడా కీలకమై బ్రాండ్ ఆక్టవియా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆరు మిలియన్ యూనిట్లు అమ్ముడైంది. 2001లో భారతదేశంలోఎంట్రీ ఇచ్చినప్పటినుంచి 90,000 యూనిట్లు విక్రయించింది.
జనవరి-జూన్‌లో 15 శాతం వృద్ధి సాధించిన కంపెనీ విక్రయాలను మరింత పెంచుకోనుందని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో స్కొడా ఆటో ఇండియా 7,576 యూనిట్లు విక్రయించినట్టు తెలిపారు. కొత్త ఉత్పత్తులతో ఈ ఏడాది 30 శాతం అమ్మకాలు పెరగాలని, తద్వారా ప్రీమియం సెగ్మెంట్లో మా స్థానం మరింత మెరుగు పరుస్తామని దీక్షిత్ వెల్లడించారు.
కొత్త ఆక్టివియాలో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఐ బజ్ డ్రైవర్ ఫెటీగ్ ఎలర్ట్, ఎనిమిది ఎయిర్ బాగ్స్ లాంటి అదనపు ఫీచర్లతో కార్ లవర్స్ ను ఆకట్టుకోనుంది. కొత్త ఆక్టేవియా ఈ విభాగంలో టొయోటా కరోలా అల్టిస్ గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.