alleged rape case
-
మళయాళ నటి కేసులో త్వరగా శిక్ష పడాలి: కేంద్రమంత్రి
మళయాళ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. ఇలాంటి కేసుల్లో నేరస్తులకు త్వరగా శిక్షలు పడాలన్నారు. ఈ కేసులో నేరస్థులకు కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని ఆయన అన్నారు. అప్పుడే మరెవ్వరూ ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా ఉంటారన్నారు. ఇలాంటి కేసుల్లో విచారణ వేగంగా జరిగి, శిక్ష కూడా త్వరగా పడేందుకు వీలుగా తాము ఒక బిల్లు తీసుకొస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో తెలిపారు. ఈ కేసుల విషయంలో రాజకీయ చిత్తశుద్ధి, దర్యాప్తు నైపుణ్యం, త్వరగా శిక్షలు పడటం అనేవి చాలా అవసరమని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. పలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా నటించిన ప్రముఖ మళయాళ నటి అహహరణ, లైంగిక దాడి కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడితో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజా అరెస్టులతో కలిపి మొత్తం తొమ్మిది మందిని పట్టుకున్నట్లయింది. Strongly condemn the kidnap of Kerala actress; exemplary punishment should be given to the criminals so that it acts as a deterrent /1 — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 20 February 2017 We are bringing a bill for speedy trial & conviction. Political will, investigative skill & quick punishments are the need of the hour /2 — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 20 February 2017 -
నటి కిడ్నాప్: టీవీ చానెల్ దారుణమైన కథనం!
పలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్గా నటించిన ప్రముఖ మలయాళీ నటి అహహరణ, లైంగిక దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నటి డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కేరళలో పెను సంచలనం సృష్టించిన ఈ కేసులో అధికార సీపీఎంకు చెందిన కైరాలి టీవీ ప్రసారం చేసిన కథనాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నటిపై లైంగిక దాడి జరిగిదంటూ వివరాలను ఆ చానెల్ ప్రసారం చేయడంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నది. నటి కిడ్నాప్, దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఆమె డ్రైవర్‌తో, ఆమెకు సంబంధం ఉందంటూ ఓ తలాతోక లేని కథనాన్ని కైరాలీ టీవీ ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది. పలు మీడియా చానెళ్లు కూడా మొదట నటి పేరును వెల్లడించాయి. అయితే, చట్టప్రకారం లైంగిక దాడికి గురైన బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలన్న నిబంధన ఉండటంతో ఆ తర్వాత తమ తీరును మార్చుకున్నాయి. కైరాలీ టీవీ అత్యుత్సాహం, అసంబద్ధ కథనాలపై ప్రముఖ మలయాళీ నటి రిమా కల్లింగల్ ఫేస్బుక్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సాటి వ్యక్తి తన జీవితంలోనే అత్యంత భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు సానుభూతి చూపాల్సిందిపోయి.. సెన్సేషనల్ కథనాల పేరిట దారుణంగా ప్రవర్తిస్తారా అని ఆమె మండిపడ్డారు. నటుడు పృథ్వీరాజ్ కూడా మీడియా తీరుపై మండిపడ్డారు. కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం తప్పుడు కథనాలు, సెన్సేషనలైజ్ చేయడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. దీంతో దిగివచ్చిన కైరాలీ టీవీ యాజమాన్యం తన ప్రసారాల పట్ల క్షమాపణలు చెప్పింది.