allegedly raped
-
స్నేహితుడే అత్యాచారం చేశాడు
నోయిడా: తన స్నేహితుడే తనపై అత్యాచారం జరిపాడని, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడని ఓ మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు చేసినట్లు iఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 26న ఈ సంఘటన జరిగిందన్నారు. సెక్టార్ 26లోని ఓ గెస్ట్ హోస్లో కలుసుకోమని శుభమ్ వర్మ అనే మిత్రుడు అడిగాడని, వివాహం చేసుకుంటానన్న సాకుగా అక్కడ తనపై అత్యాచారం జరిపాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు రాజస్థాన్‌లోని శికార్ జిల్లానుంచి వచ్చి కాన్పూర్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరు స్నేహితులని, శికార్ జిల్లాకే చెందిన ఇతను యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తుంటాడని, 15 రోజుల సెలవుపై ఇండియాకు వచ్చాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి మహిళను వైద్య పరీక్షలకు పంపామని, నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. -
పోలీసుల అతితెలివి, బాలికపై మళ్లీ అత్యాచారం
ఔరంగాబాద్: నిందితులను వెతికి పట్టుకోవడానికి పోలీసులు ప్రదర్శించిన అతి తెలివి.. మరోసారి ఓ బాలిక అత్యాచారానికి గురైంది. మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన పోలీసుల ఉద్యోగానికి ముప్పు తెచ్చింది. సినీ లెవల్లో నిందితులకు ట్రాప్ వేసిన పోలీసులు చివరికి అభాసుపాలయ్యారు. వివరాల్లోకి వెడితే ఈనెల 7వ తేదీన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి, తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు తన దగ్గరున్న మొబైల్‌తో ఈ దృశ్యాలను వీడియో తీసి, ఫోన్ ఎత్తుకుపోయారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఇంతలో అత్యాచారం చేసిన వ్యక్తులు బాధితురాలు తల్లికి ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఫోన్ తిరిగి ఇవ్వాలంటే, రూ.2000 ఇవ్వాలని , లేదంటే ఆ దృశ్యాలను ఇంటర్ నెట్లో పెడతామని బెదిరించారు. దీంతో నిందితులను ట్రాప్ చేసి ఎలాగైనా పట్టుకోవాలని ఎస్ఐ వినోద్ తదితర పోలీసులు పథకం వేశారు. బాధితురాలితో వాళ్ళకి ఫోన్ చేయించి.. ఓ ప్రదేశానికి రమ్మని చెప్పించారు. దానికి నిందితులు కూడా సరేనన్నారు. అనుకున్నట్టుగానే ఆ అమ్మాయికి అక్కడికి బయలుదేరింది. కానీ మార్గమధ్యలోనే ఆమెను అటకాయించిన ఇద్దరు వ్యక్తులు మరోసారి ఆమెపై దారుణానికి తెగబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కానీ అప్పటికే ఆ వీడియోను డిలిట్ చేశారు. దీంతో తెల్ల మొఖం వేయటం పోలీసుల వంతైంది. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారి విశ్వాస్ నాంగ్రే పాటిల్ ...ఎస్ఐని విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ నిమిత్తం ఓ పోలీస్ అధికారిని నియమించారు. అయితే నిందితుల వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన పోలీసులు వారికి గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందన్నవిషయాన్ని మాత్రం వెల్లడించారు.