పోలీసుల అతితెలివి, బాలికపై మళ్లీ అత్యాచారం | Girl raped twice by same culprits | Sakshi
Sakshi News home page

పోలీసుల అతితెలివి, బాలికపై మళ్లీ అత్యాచారం

Published Sat, Jul 11 2015 11:51 AM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM

పోలీసుల అతితెలివి, బాలికపై మళ్లీ అత్యాచారం - Sakshi

పోలీసుల అతితెలివి, బాలికపై మళ్లీ అత్యాచారం

ఔరంగాబాద్: నిందితులను వెతికి పట్టుకోవడానికి పోలీసులు ప్రదర్శించిన అతి తెలివి..  మరోసారి ఓ బాలిక అత్యాచారానికి గురైంది.  మహారాష్ట్రలోని జాల్నా  పట్టణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన  పోలీసుల ఉద్యోగానికి  ముప్పు తెచ్చింది.  సినీ లెవల్లో  నిందితులకు ట్రాప్ వేసిన పోలీసులు చివరికి అభాసుపాలయ్యారు.  

వివరాల్లోకి వెడితే  ఈనెల 7వ తేదీన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి, తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతోపాటు తన దగ్గరున్న  మొబైల్తో ఈ దృశ్యాలను వీడియో తీసి, ఫోన్  ఎత్తుకుపోయారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.   ఈ మేరకు కేసు నమోదు చేసిన  పోలీసులు  దర్యాప్తు మొదలు పెట్టారు.

ఇంతలో అత్యాచారం చేసిన వ్యక్తులు బాధితురాలు తల్లికి  ఫోన్ చేయడం మొదలుపెట్టారు.  ఫోన్  తిరిగి ఇవ్వాలంటే, రూ.2000 ఇవ్వాలని , లేదంటే ఆ దృశ్యాలను ఇంటర్ నెట్లో పెడతామని  బెదిరించారు.  దీంతో నిందితులను ట్రాప్ చేసి ఎలాగైనా పట్టుకోవాలని ఎస్ఐ  వినోద్  తదితర పోలీసులు పథకం వేశారు. బాధితురాలితో వాళ్ళకి  ఫోన్ చేయించి.. ఓ ప్రదేశానికి రమ్మని చెప్పించారు.  దానికి నిందితులు కూడా సరేనన్నారు.

అనుకున్నట్టుగానే  ఆ అమ్మాయికి అక్కడికి బయలుదేరింది. కానీ మార్గమధ్యలోనే ఆమెను అటకాయించిన ఇద్దరు వ్యక్తులు మరోసారి ఆమెపై దారుణానికి  తెగబట్టారు.   విషయం తెలుసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. కానీ  అప్పటికే ఆ వీడియోను  డిలిట్ చేశారు. దీంతో  తెల్ల మొఖం వేయటం పోలీసుల వంతైంది.

అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న  పోలీసు ఉన్నతాధికారి విశ్వాస్ నాంగ్రే పాటిల్ ...ఎస్ఐని విధుల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై విచారణ నిమిత్తం ఓ పోలీస్ అధికారిని నియమించారు.  అయితే నిందితుల వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన పోలీసులు వారికి గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందన్నవిషయాన్ని మాత్రం వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement