నాలుగోసారి టెర్మినేటర్గా..!
ఆర్నాల్డ్ ష్వాజెనెగ్గర్ నటించిన సంచలనాత్మక చిత్రం ‘టెర్మినేటర్’ చిత్రం గుర్తుంది కదా..! ఆ చిత్రం రెండు, మూడు భాగాల్లోనూ ఆయనే నటించారు. నాలుగో భాగంలో మాత్రం ఆర్నాల్డ్ నటించలేదు. ఇప్పుడు ఐదో భాగం ‘టెర్మినేటర్ జెనిసిస్’లో ఆయనే హీరో. అలెన్ టేలర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయాలనుకుంటున్నారు.