Allergic rhinitis
-
హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 32 ఏళ్లు. గత రెండు మూడు రోజుల నుంచి చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారుతోంది. వెంటనే తుమ్ములుకూడా ఎక్కువగా వస్తున్నాయి. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. అలర్జిక్ రైనైటిస్ అన్నారు. మందులు వాడాను. కానీ బాధలు అలాగే కొనసాగుతున్నాయి. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ►కారణాలు: ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. ►లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►చికిత్స: హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. సయాటికాబాధతగ్గుతుందా? నా వయసు 45 ఏళ్లు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటాను. ఈమధ్య నడుము నొప్పి ఎక్కువైంది. ఒకవైపు కాలి నొప్పితో బాధపడుతున్నాను. ఎమ్మారై తీసి, డిస్క్ బల్జ్‌తో పాటు సయాటికా అన్నారు. హోమియోలో వైద్యం ఉందా? ఇటీవల సయాటికా అనే పదాన్ని వినని వారుండరు. ఈ వ్యాధి బాధితులు తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటారు. సయాటికాను గురిచి సరైన సమయంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేని హోమియో చికిత్స చేఇంచుకోవడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఫిజియోథెరపీ, హోమియో సంపూర్ణ చికిత్సతో సయాటికా సమస్యను శాశ్వతంగా దూరం చేయవచ్చు. శరీరంలోని నరాలన్నింటిలోనూ పొడవైనది సయాటికా. ఇది వీపు కింది భాగం నుంచి పిరుదుల మీదుగా పాదాల వరకు ప్రయాణం చేస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగినప్పుడు వచ్చే నొప్పిని సయాటికా నొప్పి అంటారు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే గాక రోజువారీ వ్యవహారాల్లోనూ ఆటంకం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు. ముఖ్యంగా 30 – 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ►కారణాలు: ∙ఎముకల్లో ఏర్పడే స్పర్శ వల్ల వెన్నెముక కంప్రెస్ అవుతుంది ∙దెబ్బలు తగిలినప్పుడు పైరిఫార్మిస్ అనే కండరంపై వాచి, అది నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది ∙గర్భిణుల్లో పిండం బరువు పెరిగి నరాలపై ఒత్తిడి కలిగిస్తుంది ∙శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం వల్ల కీలు సక్రమంగా పనిచేయక సయాటికా నొప్పి కలగవచ్చు. ►లక్షణాలు: ∙కాళ్లలో నొప్పి సూదులు గుచ్చినట్లుగా ఉండటం ∙కండరాల బలహీనత, స్పర్శ కోల్పోవడం ∙రెండు కాళ్లలో లేదా ఒక కాలిలో తీవ్రమైన నొప్పి రావడం ∙బరువులు ఎత్తినప్పుడు, దగ్గినప్పుడు లేదా అధికశ్రమ కలిగినప్పుడు నొప్పి మరింత పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ►నిర్ధారణ పరీక్షలు: ఎక్స్–రే, సీటీ స్కాన్, ఎమ్మారై ►చికిత్స: సయాటికా నొప్పికి, వెన్నుపూసల్లో సమస్యలకు హోమియోలో మంచి చికిత్స ఉంది. రస్టాక్స్, కోలోసింథ్, కాస్టికమ్, సిమిసిఫ్యూగా వంటి మందులు ఈ అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే సయాటికా నొప్పి పూర్తిగా నయమవుతుంది. ఆటిజమ్‌కు చికిత్స ఉందా? మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి. ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవడలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం ∙వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలు బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది. -
అలర్జిక్ రైనైటిస్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. చాలాకాలంగా చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారడం, వెంటనే తుమ్ములు ఎక్కువగా రావడం జరుగుతోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను అడిగితే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? - రవి, వరంగల్ అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా వాపునకు గురికావడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. కారణాలు: అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఇన్నాళ్ల తర్వాతా తిరగబెడుతుందా? క్యాన్సర్ కౌన్సెలింగ్ నేను దాదాపు పన్నెండేళ్ల క్రితం కిడ్నీలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాను. మళ్లీ ఇటీవలే నడుము నొప్పి వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాను. రిపోర్ట్‌లను పరిశీలించాక డాక్టర్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. అది కిడ్నీ నుంచి వెన్నుకు పాకిందంటున్నారు. పన్నేండేళ్ల తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెడుతుందా? అది నయమయ్యే అవకాశం ఉందా? - సతీశ్‌కుమార్, నంద్యాల కిడ్నీ క్యాన్సర్ లేదా మరికొన్ని క్యాన్సర్లు చికిత్స తీసుకున్నప్పటికీ తిరగబెట్టే అవకాశం ఉంది. అది ఐదేళ్లు, పదేళ్లు, పదిహేను లేదా ఇరవై ఏళ్ల తర్వాతైనా కావచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్‌పై అదుపు సాధించేందుకు అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ విషయానికి వస్తే మీరు వెన్నుకు రేడియేషన్ చికిత్స తీసుకోవచ్చు. ఎక్స్-నైఫ్ ఎస్ఆర్ఎస్తో క్యాన్సర్‌ను అదుపు చేయవచ్చు. ఈ చికిత్స ప్రక్రియ వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవు. నొప్పిని కూడా తక్షణం నివారించవచ్చు. మా అమ్మగారికి 68 ఏళ్లు. ఆమెకు గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ వచ్చింది. మొదటి దశ (స్టేజ్-1)లో ఉందని డాక్టర్ తెలిపారు. మాకు తెలిసిన డాక్టర్లను సంప్రదిస్తే రెండు మార్గాలు తెలిశాయి. మొదటిది... శస్త్రచికిత్స. రెండోది రేడియోథెరపీ. మేం కాస్త అయోమయంలో ఉన్నాం. శస్త్రచికిత్స అన్నా, రేడియోథెరపీ అన్నా భయంగా కూడా ఉంది. దయచేసి మాకు తగిన మార్గాన్ని సూచించగలరు. - యోగేశ్వరరావు, కాకినాడ మొదటి దశ సర్విక్స్ క్యాన్సర్‌ను సర్జరీ లేదా రేడియోథెరపీ ద్వారా నయం చేయగలం. అయితే చాలా సందర్భాల్లో దీనికి మొదట శస్త్రచికిత్స చేసి, తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మీరు రేడియోథెరపీయే కోరుకుంటే అది కూడా సాధ్యమే. చాలా సందర్భాలలో సర్జరీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇటీవల రేడియేషన్ టెక్నాలజీలలో వచ్చిన పురోగతి వల్ల రేడియోథెరపీ వల్ల ఇతర దుష్ర్పభావాలు కూడా దాదాపు ఉండవు. మీరు నిర్భయంగా రేడియోథెరపీ చేయించుకోండి. -
పాప్‌కార్న్ లంగ్ అంటే..?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. నేను గత ఆర్నెల్లుగా తుమ్ములు, ముక్కుకారడం, ముక్కులు బిగదీసుకుపోయినట్లుగా ఉండటం, వాసనలు తెలియకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాను. చాలామంది వైద్యులను కలిశాను. సమస్య తగ్గినట్టే తగ్గి, మళ్లీ వస్తోంది. హోమియోలో దీనికి పరిష్కారం చెప్పండి. - సూర్యప్రకాశ్, నందిగామ మిమ్మల్ని వేధించే ఇదే సమస్యతో ఈరోజుల్లో చాలామంది బాధపడుతున్నారు. దీన్నే ‘అలర్జిక్ రైనైటిస్’ అంటారు. మీకు సరిపడనివి తగిలినప్పుడు (దుమ్ము, ధూళి, పుప్పొడి, ఘాటువాసనలు) మీకు అలర్జీ మొదలవుతుంది. దాంతో ముక్కులోని రక్తనాళాలు ఉబ్బినట్లుగా అయి, ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కు బిగదీసుకుపోవడం వంటివి కనిపిస్తాయి. లక్షణాలు ఆగకుండా తుమ్ములు రావడం, ముక్కుకారడం వంటి లక్షణాలే గాక... వాటిని నిర్లక్ష్యం చేస్తే సైనస్లకు ఇన్ఫెక్షన్ సోకి తలబరువు, తలనొప్పి వంటివి కనిపించవచ్చు. ముక్కుపొరలు ఉబ్బడం వల్ల గాలి లోపలికు వెళ్లక వాసనలు కూడా తగ్గిపోతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మున్ముందు సైనసైటిస్, నాసల్ పాలిప్స్, వంటి పెద్ద పెద్ద సమస్యలూ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ కోసం ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నివారణ ⇒ అలర్జీ కారకాలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం. ⇒ సరైన పోషకాహారం తీసుకోవడం. ⇒ ముక్కుకు సంబంధించిన వ్యాయామాలు చేయడం. ⇒ చల్లని వాతావరణానికి దూరంగా ఉడటం. ⇒ పొగతాగే అలవాటుకు దూరంగా ఉండటం. చికిత్స హోమియోలో వ్యక్తిగత లక్షణాలనూ, మానసిక స్వభావాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ చికిత్స ఇవ్వవచ్చు. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. క్రమక్రమంగా వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పోయి, అలా సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉంటే అలర్జిక్ రైనైటిస్ పూర్తిగా తగ్గుతుంది. హోమియోలో ప్రక్రియ ద్వారా దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. ఈమధ్య ఆకలి లేకపోవడం, నీరసంగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాను. క్రియాటిన్ 10, యూరియా 320 ఉన్నట్లు తెలిసింది. స్కానింగ్‌లో కిడ్నీ సైజ్ తగ్గింది. సీకేడీ ఫిఫ్త్ స్టేజ్ అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ (మూత్రపిండాల మార్పిడి) చేయించుకోవాలని అన్నారు. ట్రాన్స్‌ప్లాంట్ కాకుండా వేరే ఏమైనా మార్గాలున్నాయా? ఒకవేళ తప్పకపోతే దాత (డోనర్)గా ఎవరు ఇవ్వవచ్చో చెప్పండి. - శ్రీనివాస్, రామగుండం మీకు అన్ని విధాలా శ్రేయస్కరమైన మార్గం కిడ్నీ మార్పిడి చేయించుకునే చికిత్సే. మీ సోదరులుగానీ, సోదరీమణులుగానీ, మీ తల్లిదండ్రుగానీ దాతలుగా వ్యవహరించవచ్చు. దాతగా ముందుకు వచ్చిన వారికి అన్ని విధాలా పరీక్షలు నిర్వహించి, వారికి ఎలాంటి సమస్యా లేదని నిర్ధారణ అయితేనే డాక్టర్లు వారిని దాతగా ఆమోదిస్తారు. కిడ్నీ ఇచ్చిన తర్వాత కూడా దాతలకు ఎలాంటి సమస్యా రాదు. దాతలు రక్తసంబంధీకులు అయితే, మార్పిడి తర్వాత కూడా మూత్రపిండాలలో ఎలాంటి ఇబ్బందులు గానీ లేకుండా వ్యవహరించే అవకాశం ఉంది. ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న కిడ్నీ మార్పిడి తర్వాత కూడా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. దాతలు అందుబాటులో లేనివారు క్రమం తప్పకుండా డయాలసిస్‌ను చేయించుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులలో దాత లభించనప్పుడు క్యాడెవరస్ ఆర్గన్స్ కోసం కోసం తమ పేరును నమోదు (రిజిస్టర్) చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు జీవన్మృతుల (బ్రెయిన్‌డెడ్ పర్సన్)నుంచి కిడ్నీను స్వీకరించి, దాన్ని కిడ్నీ అవసరమైన రోగికి అమర్చుతారు. నా వయసు 32 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడు మాత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు రావచ్చా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? - సర్ఫరాజ్, నిజామాబాద్ ఇలా చాలాసార్లు మూత్రంలో రక్తం పోతున్నట్లయితే, ఏ కారణం వల్ల ఇలా జరుగుతోందో తెలుసుకొని, దానికి తగిన చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు (గ్లోమెరూలస్ నెఫ్రైటిస్ వంటివి) ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది. కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్ వంటివి లేకుండా రక్తం పోవడం జరుగుతూ ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. చాలా చిన్నప్పుడే స్మోకింగ్ మొదలుపెట్టి చాలా కాలం క్రితం ఆ అలవాటు మానేశాను. అప్పట్నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్, హుక్కా మొదలుపెట్టాను. అయితే నా ఫ్రెండ్ అయిన ఒక డాక్టర్ అది కూడా వద్దని అంటున్నారు. అవి అలాగే కొనసాగితే ‘పాప్‌కార్న్’ లంగ్ రావచ్చని అంటున్నారు. అంటే ఏమిటి? - రాధేశ్యామ్, హైదరాబాద్ పాప్‌కార్న్ లంగ్ అనేది చాలా ప్రమాదకరమైన, రివర్స్ చేయలేని సంక్లిష్టమైన సమస్య. దీన్ని నిర్ధారణ, చికిత్స... రెండూ కష్టమే. దీన్నే వైద్యపరిభాషలో బ్రాంకోలైటిస్ ఆబ్లిటేరన్స్ అంటారు. ‘కృత్రిమ వెన్న’ను తీసుకునేవారిలో కూడా ఈ పాప్‌కార్న్ లంగ్ కనిపిస్తుంది. ఇది తొందరగా ‘డై అసిటైల్’ అనే ఆవిరైపోయే ఒక రసాయన పదార్థం. సాధారణంగా దీన్ని ఆల్కహాలిక్ పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. ఆహారపదార్థాల్లోనూ కలుపుతుంటారు. పాప్‌కార్న్‌లను వెన్నలో వేయించడానికి బదులు దీనిలో వేపుతుంటారు. దానితో ఊపిరితిత్తులకు వచ్చే సమస్య కాబట్టి దీన్ని సాధారణ పరిభాషలో ‘పాప్‌కార్న్ లంగ్’ అంటుంటారు. పొడిదగ్గు, పిల్లికూతలు, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. వీటితో పాటు అలసట, జ్వరం, రాత్రివేళల్లో ఒళ్లు చెమటలు పట్టడం, ఆయాసం వంటివి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నేషనల్ జ్యూయిష్ హెల్త్ హాస్పిటల్స్ ప్రకారం కృత్రిమ వెన్నకు దీర్ఘకాలం పాటు ఎక్స్పోజ్ అయినా, పొగతాగే అలవాటు ఉన్నా ఇది రావచ్చు.దీన్ని నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎక్స్-రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో పాప్‌కార్న్ లంగ్‌ను నిర్ధారణ చేయాలి. కానీ అవి మాత్రమే నిర్ధారణ పరీక్షలు కాదు. ఒకసారి ఇది వస్తే మళ్లీ మామూలుగా కావడం కష్టం. అది దాదాపు అసాధ్యం కూడా. అందుకే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగే అలవాట్లు, కృత్రిమ వెన్న నుంచి దూరంగా ఉండాలి. దీనికి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. వాళ్లలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చేయడం ఒకే ఒక మార్గం. అయితే అది చాలా కష్టం. కాబట్టి ముందు నుంచే దీన్ని నివారించుకోవడం చాలా మేలు. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్