Beauty Tips: బాదం పొట్టు ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పడేయరు!
బాదం పప్పుని రాత్రిపూట నానబెట్టి, ఉదయం దానిమీద ఉండే పొట్టును తీసి తింటే మంచిదని చెబుతుంటారు. చాలా మంది అలాగే తింటుంటారు కూడా. అయితే, ఈ బాదం పొట్టును పడేయకుండా స్క్రబ్స్, హెయిర్ ప్యాక్స్, నైట్ క్రీమ్లు తయారు చేసుకుని వాడుకోవచ్చని బ్యూటీ నిపుణులు సూచిస్తున్నారు.
బాదం పొట్టులోని విటమిన్లు, ఖనిజపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ, కేశ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పొట్టుతో బ్యూటీ ఉత్పత్తులు తయారుచేసుకోవచ్చు.
ఫేస్ స్క్రబ్
►చర్మం ఆకృతిని మెరుగు పరిచే లక్షణాలు బాదం పొట్టులో పుష్కలంగా ఉంటాయి.
►కప్పు బాదం పొట్టును ఎండబెట్టాలి.
►కప్పు ఓట్స్, కప్పు శనగపిండి, కప్పు కాఫీ పొడిలో ఎండబెట్టిన పొట్టును వేసి గ్రైండ్ చేయాలి.
►ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వచేసుకోవాలి.
►వాడుకునేటప్పుడు ఈ పొడిలో కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి పేస్టులా కలుపుకొని ముఖానికి అప్లై చేసి, మర్ధన చేసి తర్వాత కడిగేయాలి.
►ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
ఇవి కూడా ట్రై చేయండి: Beauty Tips In Telugu: పంచదార, తేనె, ఆలివ్ ఆయిల్, నిమ్మ.. దెబ్బకు జిడ్డు వదులుతుంది!
Hair Straightening Tips: కొబ్బరి నీళ్లు, ఆలివ్ ఆయిల్ ఉంటే చాలు! జుట్టు స్ట్రెయిటనింగ్ ఇలా!