ఆల్మండ్ ప్యాక్ | Almond pack | Sakshi
Sakshi News home page

ఆల్మండ్ ప్యాక్

Published Sat, Jun 4 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

ఆల్మండ్ ప్యాక్

ఆల్మండ్ ప్యాక్

న్యూ ఫేస్
కావలసినవి: బాదం గింజలు (ముక్కలుగా చేసినవి) - 2 టీ స్పూన్లు, తేనె - 1 టీ స్పూన్, బాదం నూనె - 2 టీ స్పూన్లు
ఎలా చేయాలి: బాదం గింజలను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్‌ను ఓ బౌల్‌లోకి తీసుకొని, అందులో తేనె, బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది.
 
ఈ ప్యాక్ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. బాదం నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు రాకుండా సంరక్షిస్తుంది. అంతేకాదు ఇందులోని విటమిన్-ఇ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement