ఈ జనరేటర్‌తో రెండు విధాలా లాభం..
వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం కొత్తకాదుగానీ.. అమెరికాలోని ఆల్పవర్ల్యాబ్స్ తయారు చేసిన ఈ జీఈకే గ్యాసిఫైయర్ మాత్రం కొంచెం భిన్నమైంది. సాధారణంగా బయోమాస్‌ను మండించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే సమయంలో ఇంధనం పూర్తిగా మండిపోకముందే.. అందులోని హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి వాయువులను మరోచోటికి మళ్లించి విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకత. జనరేటర్లో నాలుగు లీటర్ల డీజిల్‌ను వినియోగించి ఉత్పత్తి చేయగల విద్యుత్‌ను కేవలం పది కిలోల వ్యర్థంతో తయారు చేయవచ్చునని కంపెనీ చెబుతోంది.
అయితే ఈ జనరేటర్లో అన్ని రకాల బయోమాస్‌లను ఉపయోగించడం కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. కొబ్బరి చిప్పలైతే భేషుగ్గా ఉపయోగించుకోవచ్చునని, వరి పొట్టు తదితర వ్యవసాయ వ్యర్థాలను వాడేటప్పుడు నిర్వహణ కొంచెం ఎక్కువ అవుతుందని ఆల్ పవర్ ల్యాబ్స్ చెబుతోంది. కాలిఫోర్నియాలోని బెర్క్లీలో ఉండే ఈ కంపెనీ ఇప్పటికే కొన్ని వందల జనరేటర్లను విక్రయించింది.