Alt News
-
జుబేర్‌కు అన్ని కేసుల్లో బెయిల్.. తక్షణమే విడుదల చేయాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ట్వీట్‌తో అరెస్టయిన ఆల్ట్ న్యూస్ కో-ఫౌండర్ మహమ్మద్ జుబేర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్నీ కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. జుబేర్‌ను రూ.20వేల పూచీకత్తుతో సాయంత్రం 6గంటల్లోగా కస్టడీ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాదు అతనిపై నమోదైన అన్ని కేసులను ఢిల్లీ స్పెషల్ సెల్‌కు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్తగా నమోదయ్యే కేసులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. 2018లో ఓ మతానికి వ్యతిరేకంగా జుబేర్ చేసిన ట్వీట్‌కు సంబంధించిన కేసును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్యే దర్యాప్తు చేస్తోంది. విచారణ సందర్భంగా జుబేర్ అరెస్టుకు సంబంధించి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. జుబైర్‌ను తరచూ కస్టడీకి తీసుకెళ్లడానికి సరైన కారణమేమి కన్పించడం లేదని చెప్పింది. పోలీసులు అరెస్టు చేసే అధికారాన్ని మితంగా ఉపయోగించుకోవాలని హితవు పలికింది. అలాగే జుబేర్‌ను ట్వీట్ చేయకుండా నిషేధించాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. జర్నలిస్టును రాయొద్దని చెప్పడమంటే.. న్యాయవాదిని వాదించవద్దనడంతో సమానమని అభిప్రాయపడింది. ఆయన చేసే ట్వీట్లకు బాధ్యత కూడా ఆయనదే అని స్పష్టం చేసింది. వాటికి చట్టపరమైన నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. 2018 ట్వీట్‌కు సంబంధించి జుబేర్‌పై మొదట ఢిల్లీలో కేసు నమోదైంది. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏడు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీంతో యూపీలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని జుబేర్ సుప్రీంను ఆశ్రయించారు. వాటన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. కేసులను కొట్టి వేసే విషయంపై ఢిల్లీ హైకోర్టునే సంప్రదించాలని సూచించింది. చదవండి: పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర కాల్పులు.. సింగర్ సిద్ధూ హత్య కేసు నిందితుడు హతం! -
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జుబేర్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. కాగా, మహ్మాద్ జుబేర్‌కు ప్రాణ హాని ఉందని, ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నాయని భద్రతపై ఆందోళన చెందుతున్నామని జుబేర్ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొన్‌సేల్వ్స్ సుప్రీంకోర్టుకు గురువారం విన్నవించారు. ఈ నేపథ్యంలో బెయిల్ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టన ధర్మాసనం.. జుబేర్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. యూపీ కేసులో జుబేర్ బెయిల్ పిటిషన్‌ను సీతాపూర్ కోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జస్టిస్ ఇందిరా బెనర్జీ యూపీ ప్రభుత్వం, యూపీ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ జుబేర్‌కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్టు తెలిపారు. జుబేర్ ఎలాంటి ట్వీట్లు చేయరాదని, ఆధారాలు తారుమారు చేయరాదని కోర్టు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికగా జుబేర్ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. జూన్ 1న నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించే మధ్యంతర బెయిల్ మంజూరైందని చెప్పారు. విచారణను నిలిపివేయడం, ఈ అంశంలో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని సర్వోన్నత న్యాయస్ధానం తేల్చిచెప్పింది. మధ్యంతర ఉత్తర్వులను సోమవారం వరకూ నిలిపివేయాలని యూపీ పోలీసుల తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. ఇక, నాలుగేళ్ల కిందట ఆయన షేర్ చేసిన ఓ ట్వీట్ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. జుబేర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం యూపీలోని సీతాపూర్ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. -
చంపేస్తామంటూ బెదిరింపులు.. కోర్టును ఆశ్రయించిన జుబేర్
న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. కాగా, మహ్మద్ జుబేర్ బెయిల్ కోసం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే, మహ్మాద్ జుబేర్‌కు ప్రాణ హాని ఉందని, ఆయనకు పలువురి నుంచి బెదిరింపులు వస్తున్నాయని భద్రతపై ఆందోళన చెందుతున్నామని జుబేర్ న్యాయవాది సీనియర్ అడ్వకేట్ కొలిన్ గొన్‌సేల్వ్స్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వెంటనే.. జుబేర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని న్యాయవాది కోరారు. కాగా, న్యాయవాది విజ్ఞప్తి మేరకు.. రిజిస్ట్రీలో బెయిల్ పిటిషన్ అంశం రిజిస్టర్ అవడంతో రేపు(శుక్రవారం) విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక, నాలుగేళ్ల కిందట ఆయన షేర్ చేసిన ఓ ట్వీట్ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. జుబేర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం యూపీలోని సీతాపూర్ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్‌పై ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు.. వీడియో వైరల్ -
నిందగా మారిన గణచిహ్నం
హృషీకేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రాల్లో 1983 నాటి ‘కిసీ సే న కెహనా (ఎవరితో చెప్పొద్దు)’ ప్రసిద్ధ హాస్యచిత్రం. అందులో ‘హనీమూన్’ హోటల్ బోర్డును ‘హనుమాన్’గా మార్చారని హీరోయిన్‌తో అంటాడు హీరో. అలా హనుమాన్ను వ్యాపారీకరించడాన్ని దర్శకుడు చూపించారు. ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ ఈ సినిమా స్క్రీన్ షాట్‌ను చూపి, ‘2014 ముందు హనీమూన్, 2014 తర్వాత హనుమాన్’ అని 4 ఏళ్ల క్రితం ట్వీటారు. ఇది మత భావాలను రెచ్చగొట్టే అంశంగా మారింది. భగవాన్ హనుమాన్ను కోతి అని అవమానించారని జుబేర్‌పై అభియోగం. పురాణాల్లో రాక్షసులు, దేవగణాలు, యక్షులు, రామాయణంలో వానరులు వారి గణచిహ్నాలతో పేర్కొనబడ్డ స్థానిక జాతుల మానవ సమూహాలు. గణచిహ్నాలను రూపాలకు అన్వయించారు. ‘కపి’ పదాన్ని కోతి అని అనువదించారు. సవరులు, శబరులు, ఇతర ఆదివాసీ తెగలవారు రామాయణంలో వానరులుగా పేర్కొనబడ్డారు. వీరు వాలం (తోక) గల నరులు. తోకలాంటి వస్త్రం ధరించే నరులు. వెనుక పొడవుగా వేలాడే గోచీని కట్టుకునేవారు. ఈ గోచీ పురుషులకు మాత్రమే పరిమితం. వాలి భార్య తార, సుగ్రీవుని భార్య రుమాదేవి, ఆంజనేయుని తల్లి అంజనీ దేవి వగైరా వానర జాతి స్త్రీలకు తోకలుండవు. వానరులు, వానర రాజ్యాల గురించి రామాయణం చాలా విషయాలు చెప్పింది. వాటిని కల్పిత, ఉద్దేశపూరిత వక్రీకరణలకు గురిచేశారు. వానరులంటే కోతులని ప్రచారం చేశారు. రాముడు కూడా యుద్ధంలో వానరులు మానవరూపాల్లో ఉండరాదన్నాడు. హరిరూపంలో ఉండాలన్నాడు. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, యముడు, సింహం, గుర్రం, పాము, కోతి, కప్ప అని అర్థాలు. ఆటవికుల ద్వేషులు కోతి అన్న అర్థాన్ని స్థిరీకరించారు. వానరజాతికి కోతిచేష్టలు అంటగట్టి వినోదించారు. వానరులను కోతులను చేసి ఆంజనేయుని అవమానించింది ఆర్య జాత్యహంకారులే. మతవాదులు వారి వారసులు. హేతుబద్ధ ఆలోచనలను ప్రజల ముందు ఉంచవలసిన బాధ్యత సామాజిక శాస్త్రవేత్తలదీ, విజ్ఞులదీ! (క్లిక్: ప్రశ్నించినవారికి నిర్బంధమా?) – సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి, గుంటూరు