aluminum company
-
Nalco: రెండేళ్లలో పూర్తి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), మిశ్ర ధాతు నిగమ్ (మిధానీ)లు సంయుక్తంగా రాష్ట్రంలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రెండేళ్లలోగా పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాల్కో, మిధానీల సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ అత్యాధునిక అల్యూమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. రూ.5,500 కోట్ల భారీ పెట్టుబడితో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఇది ఏర్పాటవుతోంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం 60 వేల మెట్రిక్ టన్నులు. దీని ద్వారా దాదాపు 1000 మందికి ఉపాధి లభిస్తుంది. నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిధానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ప్రాజెక్టు గురించి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన సీఎం.. మౌలిక సదుపాయాలపై తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ అనుబంధ రంగాల పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించగా అందుకు సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన నాల్కో, మిథానీ సీఎండీలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాల్కో సీఎండీ శ్రీధర్ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్ కుమార్ ఝా కలిశారు. నాల్కో, మిథానీ సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ (యూడీఏఎన్‌ఎల్) ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్ అల్యుమినియం అల్లాయ్ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. రూ.5,500 కోట్లతో ఏర్పాటు కానున్న పరిశ్రమ, ఏడాదికి 60,000 మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ, రెండు నుంచి రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి కానుంది. చదవండి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కొత్త కమిటీ దాదాపు 750-1000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్ట్ ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనపై ఎదురవుతున్న సమస్యలను సీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. రక్షణ అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాల తయారీదారుల అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా ఎంఎస్ఎంఈ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయాలని సీఎం సూచించగా, సీఎండీలు అంగీకరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్.సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన గుమ్మళ్ళ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాల దెబ్బకు ఆ కంపెనీలకు భారీ నష్టాలు..!
కరోనా మహమ్మారి కాలంలో వేగంగా వృద్ది చెందుతున్న రంగం ఏదైనా ఉంది అంటే ఎలక్ట్రిక్ వాహన రంగం అని చెప్పుకోవాలి. అయితే, గ్లోబల్ మొబిలిటీలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వాటా పెరగడంతో హిందాల్కో వంటి అల్యూమినియం ఉత్పత్తిదారులు లాభపడితే.. ఉక్కు తయారీదారులు నష్టపోతున్నట్లు ఒక కొత్త పరిశోధన నివేదిక పేర్కొంది. మెటల్ రంగంలో ఉన్న దిగ్గజ టాటా స్టీల్, జెఎస్ డబ్ల్యు స్టీల్ వంటి ఉక్కు ఉత్పత్తిదారుల కంటే హిందాల్కో ధర సుమారు 30% పేరుగుతున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ జెఫెరీస్ తెలిపింది. అల్యూమినియం తేలికైన లోహాలలో ఒకటి. ఈ లోహాన్ని ఈవీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇనుముతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉండటం వల్ల ఈ లోహాన్ని ఏరోస్పేస్ పరిశ్రమలో కూడా ఉపయోగిస్తారు. సాదారణ వాహనాలలో సగటున అల్యూమినియం వినియోగం కారులో సుమారు 50-70 కిలోగ్రాములు, ద్విచక్ర వాహనాల 20-30 కిలోలుగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఎలక్ట్రిక్ కారులో సగటున 250 కిలోల అల్యూమినియం ఉపయోగిస్తున్నారు. ఫలితంగా, అల్యూమినియం బాడీలతో తయారు చేసే వాహనాలు ఇతర వాహనాల కంటే ఖరీదైనవిగా మారుతున్నాయి. అల్యూమినియం వినియోగం పెరగడం వల్ల ఉక్కు వంటి లోహానికి డిమాండ్ సెప్టెంబర్ 2021 నుంచి తగ్గుతూ వస్తుంది. ఈవీలలో అల్యూమినియం ఎక్కువగా వినియోగించడానికి రేంజ్ ఒక ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ వాహన బరువు తగ్గడం వల్ల ఆ మేరకు వాహనం రేంజ్ అనేది పెరుగుతుంది. ఈవీ అమ్మకాలలో వాహన రేంజ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. (చదవండి: అదానీ గ్రూప్స్ మరో రికార్డు..! ఏకంగా రూ. 10 లక్షల కోట్లు..!) -
ప్రభుత్వం నుంచి 25% వాటా కొంటున్న నాల్కో
కేంద్రానికి రూ.3,250 కోట్లు సమకూరే అవకాశం! న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అల్యూమినియం కంపెనీ నాల్కో... కంపెనీకి చెందిన 25 శాతం వాటాను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయనుంది. ఏ ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి నాల్కో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ మరో 15 రోజుల్లో సమావేశం కానున్నదని గనుల కార్యదర్శి బల్విందర్ కుమార్ చెప్పారు. ప్రభుత్వం నుంచి 25 శాతం వాటాను కొనుగోలు చేసేలా నాల్కోకు మార్గదర్శకత్వం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తమకు లేఖ రాసిందని పేర్కొన్నారు. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.3,250 కోట్ల నిధులు వస్తాయని అంచనా. నాల్కోలో 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1,300 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం గతంలో భావించింది. కానీ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉండటంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు.