aman sing
-
రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిపై కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగిన విషయం తెలిసిందే. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షించగా అమన్‌తో పాటు మరో ఐదుగురు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. వారి నుంచి సుమారు 200 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్‌లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ డ్రగ్స్ దందా నడుపుతున్నారు. ఈ దందాలో రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ని A6గా కేసు నమోదు చేశారు. అతనితో పాటు ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ ఉన్నట్లు తేలింది. అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజుల రిమాండ్‌ను ఉప్పరపల్లి కోర్టు విధించింది. వారందరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
స్వీయ రక్షణ అవసరం
హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ తమ్ముడు అమన్ హీరోగా రూపొందిన చిత్రం ‘తెర వెనుక’. ‘బంతిపూల జానకి’ ఫేమ్ నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం వహించారు. విజయలక్ష్మి మురళి మచ్చ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలపై జరుగుతున్న దాడులను మా చిత్రంలో చూపిస్తున్నాం. 101, షీ టీమ్స్ ఎన్ని ఉన్నా స్వీయ రక్షణ ముఖ్యం అని చెబుతున్నాం. ఒక డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం సాగుతుంది. అమన్ చక్కగా నటించాడు. శ్వేతా వర్మ చేసిన డీజీపీ పాత్ర సినిమాకే హైలెట్. ఓ రిటైర్డ్ డీఎస్పీ సూచనలతో పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎంతో శ్రద్ధ పెట్టి ఈ సినిమా తీశాం. క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉంటాయో చూపించాం. నేను దర్శకత్వం వహించిన ‘సంత’ (మట్టి మనుషుల ప్రేమ కథ) చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది’’ అన్నారు. -
భార్యను తిట్టిందని అమ్మను చంపేశాడు
అలిరాపూర్: భార్యను తిట్టిందనే కోపంతో కన్నతల్లినే కడతేర్చాడో ప్రబుద్ధుడు. మధ్యప్రదేశ్‌లోని అలీరాపూర్కు చెందిన 35 ఏళ్ల అమన్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి పని సరిగ్గా చేయడం లేదని కోడలు సంగీతను మందలించిది అత్తగారు 60 ఏళ్ళ సాని బాయి. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు తల్లిని గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ తెలిపారు. నిందితుడికి ఇద్దరు అన్నదమ్ములున్నారు. కూలిపని చేసుకునే ఈ కుటుంబం రెండువారాల క్రితమే గుజరాత్ నుంచి ఇక్కడు వచ్చినట్టు ఆయన తెలిపారు.