
భార్యను తిట్టిందని అమ్మను చంపేశాడు
అలిరాపూర్: భార్యను తిట్టిందనే కోపంతో కన్నతల్లినే కడతేర్చాడో ప్రబుద్ధుడు. మధ్యప్రదేశ్లోని అలీరాపూర్కు చెందిన 35 ఏళ్ల అమన్ సింగ్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి పని సరిగ్గా చేయడం లేదని కోడలు సంగీతను మందలించిది అత్తగారు 60 ఏళ్ళ సాని బాయి.
దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు తల్లిని గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి ఆనంద్ సింగ్ తెలిపారు. నిందితుడికి ఇద్దరు అన్నదమ్ములున్నారు. కూలిపని చేసుకునే ఈ కుటుంబం రెండువారాల క్రితమే గుజరాత్ నుంచి ఇక్కడు వచ్చినట్టు ఆయన తెలిపారు.