Amanda
-
‘ఓప్రా విన్ఫ్రే’షో: అతిథిగా ఇరవై మూడేళ్ళ యువతి!
ఆపిల్ కంపెనీ ఇంటర్నెట్ టీవీ చానెల్ ‘ఆపిల్ ప్లస్’ ప్రారంభం అయిన ఈ పదహారు నెలల్లో ఆ చానెల్ షోలలో అత్యధికంగా వీక్షకుల రేటింగ్ ఉన్న ‘ది ఓప్రా విన్ఫ్రే కాన్వర్జేషన్’ షో మొన్న శుక్రవారం మొదలవగానే ఆ చిన్న తెరకు ఒక పెద్దకళ వచ్చింది! అతిథి ఇరవై మూడేళ్ల అమందా గోర్మన్. ఆతిథ్యమిచ్చినది అరవై ఏడేళ్ల ఓప్రా విన్ఫ్రే. ఇద్దరూ కూడా వయసుతో నిమిత్తం లేని ప్రతిభా సామర్థ్యాలతో ప్రముఖులుగా గుర్తింపు పొందిన (విన్ఫ్రే), పొందుతున్న (అమందా) వారు. ఇద్దరూ నల్లజాతి అమెరికన్ మహిళలు. ఒకరోజు వస్తుంది. ఆ రోజున భయజ్వాల ఛాయ నుంచి బయట పడతాం. కొత్త ఉదయంలోకి..కొత్త వెలుగులోకి వచ్చేస్తాం. వెలుగును ధైర్యంగా చూడాలి. వెలుగును చూసేందుకు ధైర్యం చేయాలి. అమందా ‘ది హిల్ వియ్ క్లైంబ్’ అనే కవితలోని కొంత భాగం కెరీర్లో విన్ఫ్రేతో పోల్చి చూసినప్పుడు అమందా ఇంకా జీవితారంభంలోనే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ, ఇంటర్వూ్యలో విన్ఫ్రే ఆమెను అలా అనిపించనివ్వలేదు. ఒక చిన్న పిల్లలా కాక, ఒక వ్యక్తితో మాట్లాడినట్లే విన్ఫ్రే సంభాషణ మొత్తం నడిపారు. ఆ ధోరణి టీవీ వీక్షకులలో విన్ఫ్రేతో సమానంగా అమందా పైన కూడా గౌరవం కలిగేలా చేసింది! ‘‘అమెరికా ఒక గొప్ప ప్రాధాన్యం కలిగి ఉన్న చారిత్రక క్షణాలలోకి ప్రవేశిస్తున్న సమయంలో వర్తమానంలోకి అమందా రావడం జరిగింది! తనను నేను కలుసుకున్న తొలి క్షణంలోనే అమె యవ్వనోత్సానికి మంత్ర ముగ్ధురాలిని అయ్యాను’’ అని అమందా ఇంటర్వూ్య ప్రారంభానికి ముందు చెప్పారు ఓప్రా విన్ఫ్రే! చారిత్రక క్షణాలు అంటే ఆమె ఉద్దేశం.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భం లోనివని. ఆ రోజు జనవరి 20 న అమందా ‘ది హిల్ వియ్ క్లైంబ్’ అనే కవితను చదివి వినిపించారు. అది ఆమె రాసిందే. అయితే బైడెన్ ప్రత్యేక ఆహ్వానంతో అమందాకు లభించిన ప్రాధ్యానం కాదది. ఆ మునుపే ఆమె తన పద్దెనిమిదవ యేట నుంచీ పెద్ద పేరున్న కవయిత్రి. ఆరవ యేట నుంచీ మానవతావాద కవితలు రాస్తున్నారు. ఎంపిక చేసుకున్న కార్యక్రమాలలో మాత్రమే కవితా పఠనం చేస్తూ వస్తున్నారు. ఆ ‘ఎంపిక’ పూర్తిగా ఆమెదే. గత ఏడాది జూలై 4 న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా ఆమె తన ‘ఇనాగురల్ పొయెట్రీ’ని వినిపించారు. ఆమెకు ప్రారంభోత్సవాల కవయిత్రిగా పేరు. అయితే ఆ కవితలేవీ ఎవరినీ కొనియాడేవి కావు. సమ మానవ భావనను రేకెత్తించేవి. హార్వర్డ్ యూనివర్సిటీ వార్షికోత్సవంలోనైతే ఆమె కవితకు ప్రొఫెసర్లు సైతం ప్రణమిల్లారు. ‘నా కవిత జీవితకాలం ఒక రాత్రి. కానీ హృదయాన్ని స్పృశిస్తుంది’ అని అమందా అంటుంటారు. ఆమె ఒక కార్యక్రమానికి ఒక కవితను మాత్రమే రాస్తారు. ఆమెకు ఇష్టమైన కవులు ఎలిజబెత్ అలెగ్జాండర్, రిచర్డ్ బ్లాంకో. వాళ్లిద్దరూ ఆమె కన్నా రెండింతల వయసు ఉన్నవాళ్లు. తరచు వెళ్లి వాళ్లను కలుస్తుంటారు అమందా. టీనేజ్లోనే అమందా తొలి కవితా సంకలనం వెలువడింది. ‘ది వన్ ఫర్ హూమ్ ఫుడ్ ఈజ్ నాట్ ఇనఫ్’ ఆ పుస్తకం పేరు. ఇంకో రెండు పుస్తకాలు వస్తున్నాయి. వాటిని ప్రచురించేందుకు ప్రసిద్ధ వైకింగ్ సంస్థ ఆమెతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుని ఉంది. ఇవన్నీ తెలిసిన విషయాలే. తాజాగా ఓప్రే విన్ఫ్రే ఇంటర్వూ్య మూలంగా తెలిసిన కొత్త సంగతి ఏమిటంటే.. అమందా భవిష్యత్తులో అమెరికా అధ్యక్షురాలిగా పోటీ చేయబోతున్నారు! ఆ మాత్రం ఫైటింగ్ స్పిరిట్ లేకుంటే విన్ఫ్రే ఎవర్నైనా ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు? విన్ఫ్రే ఇంటర్వ్యూ చేయడం కూడా అమందాకు ఒక పెద్ద ప్రశంసాపత్రమే. లేదా ఒక అవార్డు అనుకోవచ్చు. విన్ఫ్రే ఏ స్థాయి వ్యక్తులతో టీవీ స్క్రీన్‌పై సంభాషిస్తారో ప్రపంచానికి తెలియంది కాదు. ఇటీవల ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్‌తో ఓప్రా చేసిన ఇంటర్వూ్య సంచలనం రేపింది. విన్ఫ్రే ప్రశ్నలు అలా ఉంటాయి మరి. అతిథుల గౌరవం తగ్గకుండా వాళ్లకు తెలియకుండానే వాళ్ల గుండె లోతుల్లోకి మాటలతో ఈదుకుంటూ వెళ్లి సడీ చప్పుడూ లేకుండా మళ్లీ బయటికి వచ్చేస్తారు. ఇప్పుడీ ఆపిల్ ప్లస్ చానల్లోనే వన్ఫ్రే ఇంతవరకు ఇంటర్వ్యూ చేసిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, హాలీవుడ్ నటుడు మాథ్యూ మెకానీ, అమెరికన్ గాయకుడు, గేయ రచయిత స్టీమ్ వండర్, అమెరికన్ రచయిత ఇబ్రహిం ఎక్స్.కెండీ వంటి వారు ఉన్నారు. వాళ్లందరిలోకి చిన్న అయినా కూడా వాళ్లందరిలా సృజన ఉన్న కారణంగా అమందాకు.. వారితో సమానంగా ప్రాధాన్యం లభిచింది. ఇంతకీ అమందా ఏమంటారు? 2036 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారట. ఆ ఏడాదికి ఆమె 35 ఏళ్లు దాటి ఉంటారు. అమెరికా ప్రెసిడెంటుగా పోటీ చేయడానికి అవసరమైన కనీస వయసు అది. అమందా బ్లాక్ క్యాథలిక్. లాస్ ఏంజెలిస్‌లోని సెయింట్ బ్రిగిడ్ క్యాథలిక్ చర్చిలో సభ్యురాలు. బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలో కవితను చదివి వినిపించిన రెండో రోజు ఆమె ‘ది లేట్ లేట్ షో విత్ జేమ్స్ కార్డెన్’ షోలో కనిపించారు! దేవుడు సృష్టించిన వారిలో కోర్డన్ తన అభిమాన మానవుడు’ అని అమందా ఆ షోలో చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది. ‘అమందా ఒక పవర్‌హౌస్ అనీ, ఆమె జీవిత చరిత్ర ప్రతి రెండు వారాలకు పాతబడిపోతుందని స్వచ్ఛంద ‘అర్బన్ వర్డ్ ఎన్.వై.సి.’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ సిరీల్లే అభినందించారు. అమందాకు అన్నిట్లోనూ తల్లి జోన్ విక్స్ స్ఫూర్తి. కవితలు రాయడానికి, మానవ హక్కుల ఉద్యమాల్లో పని చేయడానికి కూడా. కూతురికి అంతగా ప్రేరణ ఇచ్చే ఆ తల్లి అమందా రాజకీయాల్లోకి వెళతానంటే వద్దంటుందా! జోన్ విక్స్ ఆరో తరగతి ఇంగ్లిష్ టీచర్. అమందాను, అమందా ఇద్దరు అక్కచెల్లెళ్లను సింగిల్ మదర్‌గా పెంచి పెద్ద చేశారు. -
అనిసిమోవా సంచలనం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈసారి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ కనిపించనుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) ఇంటిముఖం పట్టింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల టీనేజర్ అమండ అనిసిమోవా తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో హలెప్‌ను బోల్తా కొట్టించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. అంతేకాకుండా నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్–2007 ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. 1990లో జెన్నిఫర్ కాప్రియాటి తర్వాత అమెరికా తరఫున ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా... 1997లో వీనస్ విలియమ్స్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా అనిసిమోవా ఘనత వహించింది. మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–3, 7–5తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా; మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)తో జొహనా కొంటా (బ్రిటన్) తలపడతారు. సెమీస్‌లో జొకోవిచ్, థీమ్ పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7–5, 6–2, 6–2తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–2, 6–4, 6–2తో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో ఫెడరర్ (స్విట్జర్లాండ్); జొకోవిచ్‌తో థీమ్ ఆడతారు. -
ఆ పాట.. నా అంత్యక్రియల్లో వినిపించండి!
అందాల తార.. అమందా హోల్డెన్... ఇప్పుడో విచిత్ర ప్రకటన చేసి వార్తల్లో నిలిచింది. తనకు ఇష్టమైన అబ్బా డ్యాన్సింగ్ క్వీన్ సాంగ్ ను తన అంత్య క్రియల సమయంలో ప్లే చేయాలంటూ వేదికపై వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో ఆడిషన్స్ జరుగుతుండగా ఆ పాటను ఎంతో ఉద్వేగంగా పాడిన ఆమె... ఆ తర్వాత అదే సాంగ్ తనను సమాధిలో ఉంచే సమయంలో పాడాలంటూ కోరడం విన్నవారికి విస్మయం కలిగించింది. ఇంతకూ అమందా ఆవేదన వెనుక కారణం ఏమయ్యుంటుంది? హాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచే అందాల నటిగానే కాక, మంచి సింగర్ గానూ, ప్రెజెంటర్ గానూ పేరుతెచ్చుకున్న 'అమందా లూయిస్ హోల్డెన్'... బ్రిటన్ ఐటీవీ కార్యక్రమం 'బ్రిటన్ గాట్ ట్యాలెంట్' షోలో జడ్జిగా కూడా ప్రత్యేక ప్రశంసలందుకుంటోంది. ఇప్పుడు అదే వేదికపై టాలెంట్ షో ఆడిషన్ కు ముందు తనకు ఎంతో ఇష్టమైన, తాను మొదటిసారి మనసుకు నచ్చి, మెచ్చి పాడుకున్న పాట (అబ్బా డ్యాన్సింగ్ క్వీన్) ఎంతో శ్రావ్యంగా ఆలపించింది. ఇంతలో ఏమైందో ఏమో ''ఇది నాకు ఎప్పటికీ ఇష్టమైన పాట. నా మనసునుంచి జాలువారిన గీతం. నా మరణానంతరం నన్ను సమాధిలో ఉంచే సమయంలో ఈ పాటను ప్లే చేయండి'' అంటూ అమందా వెల్లడించింది. కార్యక్రమం ప్రారంభం అవుతున్న సమయంలో సహ జడ్జి సైమన్ కోవెల్ చేసిన సరదా కామెంటే ఆమె అప్రస్తుత ప్రకటన వెనుక కారణమై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. బిజిటి ఆడిషన్స్ సమయంలో సైమన్ కోవెల్... అమందా మాజీ భర్త.. హాస్యనటుడు లెస్ డెన్నిస్ పై చేసిన సరదా కామెంట్.. ఆమెకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఊహించని ఉద్వేగానికి లోనయ్యింది. అదే సమయంలో డైనోసార్ డ్రెస్ తో డ్యాన్స్ ట్రూప్ స్టేజ్ పైకి రావడం ఆమెకు కలసి వచ్చింది. ఇంకేముందీ... వారికి ఓ పక్క అభినందనలు తెలుపుతూనే ఆ డైనోసార్ నావైపే చూస్తోందని, దాని మోసపూరిత ప్రవర్తన గురించి నాకు ఎప్పుడో తెలుసునని మిస్టర్ నాస్టీగా కూడా దానికి పేరు అందుకే వచ్చిందని ఇలా అనేక వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సమయానికి డెన్నిస్ వేదిక ముందు ఉండటం.. సైమన్ వెక్కిరించడం ఆమెను ఆవేశానికి గురి చేశాయి. ఆమె ప్రవర్తనకు సర్ది చెబుతూ 'లీవ్ లెస్ ఎలోన్' అంటూ డెన్నిస్ ను ఉద్దేశించి సైమన్ అనడం కూడా అమందాను పట్టలేని ఉద్వేగానికి లోను చేశాయి. ఆమె చేతిలో సుమారు ఏభై వేల రూపాయల ఖరీదైన ఫోన్ ను విసిరికొట్టి నాశనం చేయడమే కాక, అక్కడున్న గ్లాసుల్లో నీటిని కూడా సైమన్ పై పోసి నానా హంగామా చేసింది. అమందా ప్రవర్తనపై ఇంతకు ముందే ఓసారి అనుభవం ఉండటంతో ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ సైమన్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గతంలో బ్రిటన్ గాట్ మోర్ ట్యాలెంట్ సమయంలో కూడా అమందా ఇలాగే ప్రవర్తించింది. అప్పట్లో అతిథిగా వచ్చిన స్టీఫెన్ ముల్లెన్... అమందాను.. న్యూయార్క్ సామాజిక వేత్త జోస్లిన్ వైల్డెన్ స్టిన్ తో పోలుస్తూ వెక్కిరించడం ఆమెకు ఆగ్రహం తెప్పించింది. నట జీవితంలోనూ, సింగర్ గానూ, జడ్జిగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమందా వివాహ జీవితం మాత్రం ఎన్నో మలుపులు తిరగడం, ఎన్నోసార్లు మోసపోవడం కూడా ఆమె కోపం వెనుక కారణాలై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. 1995 లో లెస్ డెన్నిస్ ను వివాహమాడిన అమందా ఎనిమిదేళ్ళ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో 2003 లో విడిపోయారు. అనంతరం 2008 లో తిరిగి క్రిస్ హూగ్స్ ను పెళ్ళి చేసుకుంది. 44 ఏళ్ళ అమందాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ గాట్ ట్యాలెంట్ షో జడ్జింగ్ ప్యానెల్ లో సైమన్ తో పాటు... అంమందా కూడా జడ్జిగా కొనసాగుతోంది. -
ప్రశాంత్‌తో ఆస్ట్రేలియా అమ్మడు
జీన్స్ చిత్రంలో ప్రశాంత్‌తో అందాలరాశి ఐశ్వర్యారాయ్ రొమాన్స్ చేసిన విషయం ఆ చిత్రంతో ఆ జంట హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే ప్రశాంత్‌తో తాజాగా ఆస్ట్రేలియా అందగత్తె అమండా డ్యూయెట్స్ పాడుకోవడం విశేషం. చార్మింగ్ హీరో ప్రశాంత్ తాజాగా నటిస్తున్న భారీ చిత్రం సాహసం. పలు విశేషాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని స్టార్ మూవీస్ అధినేత సీనియర్ నటుడు త్యాగరాజన్ వెల్లడించారు. నవ దర్శకుడు అరుణ్‌రాజ్ వర్మ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి పలువురు ప్రముఖ నటీమణుల పేరు ప్రచారంలో ఉన్నాయి. దీంతో అసలు చిత్ర హీరోయిన్ ఎవరన్న రహస్యాన్ని నిర్మాత త్యాగరాజన్ శుక్రవారం బయటపెట్టారు. ఈ సందర్భంగా చిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ను హీరో ప్రశాంత్ పరిచయం చేశారు. ఆస్ట్రేలియా బ్యూటీ : హీరోయిన్ పేరు అమండా. ఆస్ట్రేలియా వాసి. తల్లి ఇండియన్, తండ్రి ఇంగ్లాడ్ దేశస్థుడు. 19 ఏళ్ల అమండా పెరిగింది ఆస్ట్రేలియాలో. అందం, అభినయం మెండు గా గల ఈమె ఒక బాలే డాన్సర్. ఈ నృత్యంలో పలు బహుమతులను గెలుచుకున్న ఈ బ్యూటీ నటనా పాఠశాలలో శిక్షణ పొందారు. ఈ సుందరికి సంబంధించిన కొన్ని వివరాలు ఇవి . ఈ అవకాశం అదృష్టం : ప్రశాంత్ లాంటి ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం రావడం నా అదృష్టం అని అమండా అన్నారు. కాగా ఈమె నటనను ఆ చిత్రంలో నటిస్తున్న మరో సీనియర్ న టుడు నాజర్ అభినందించారట. కోలీవుడ్‌కు లభించిన మరో చక్కని నటి అమండా అంటూ ప్రశంసలు పొందిన లక్కీ గర్ల్ అమండా. సుదీర్ఘ అన్వేషణ ఫలం : సాహసం చిత్ర హీరో ప్రశాంత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలామందిని పరిశీలించామన్నారు. వందలాదిమంది అన్వేషణలో ఎంపికైన నటి అమండా అని అన్నారు. సాహసం చిత్రం కోసం అందం, అభినయం, నృత్యం తెలిసిన నటి అవసరం అయ్యారన్నారు. ఎనిమిది నెలల సుదీర్ఘ అన్వేషణ ఫలితం ఈ అమండా అని పేర్కొన్నారు. సాహసం చిత్రం విడుదలైనాంతరం అమండా గురించే ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటారన్నారు. పెద్ద పెద్ద సంభాషణలకు కూడా ఆమె బట్టీపట్టి చక్కగా చెప్పేశారన్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే హాలీవుడ్ నటి నర్గీస్ బక్రి సింగిల్‌సాంగ్ ప్రశాంత్‌తో ఆడి దుమ్ములేపారు. విదేశాలలో గీతాలు: తాజాగా ఈ ఆస్ట్రేలియా బ్యూటీ సాహసం చిత్రం కోసం 40 రోజులు నటించారు. ఇప్పుడు ప్రశాంత్‌తో కలిసి జపాన్, మలేషియా, కొరియా దేశాల్లో యువళగీతాలు పాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. గ్రాండ్‌గా ఆడియో : ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని త్వరలో చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కథనం, సంభాషణల కర్త త్యాగరాజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్రం కోసం పాడిన మోహిత్ చాహాన్ శ్రీయ ఘోషల్, శంకర్ మహదేవన్, సంగీత దర్శకుడు అనిరుద్, నటుడు శింబు, లక్ష్మీమీనన్, ఆండ్రియా పాల్గొననున్నారని తెలిపారు. చిత్రాన్ని మేలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.