రాణించిన నిరూప్, అయూబ్
జింఖానా, న్యూస్‌లైన్: గ్రీన్ టర్ఫ్ బౌలర్లు నిరూప్ (4/26), అమర్ అయూబ్ (4/20) గోల్కొండ సీసీ జట్టుకు చుక్కలు చూపిం చారు. దీంతో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హెచ్‌సీఏ కిషన్ ప్రసాద్ వన్డే నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన గోల్కొండ సీసీ 88 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన గ్రీన్ టర్ఫ్ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి నెగ్గింది.
ముజాఫర్ అలీ ఖాన్ 38 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 129 పరుగుల తేడాతో ఆర్కే పురం జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన పోస్టల్ 9 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. నిషాంత్ (92), నర్సింగ్ (50 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఆర్కే పుర ం 110 పరుగులకే ఆలౌటైంది. పోస్టల్ బౌలర్ సాగర్ 3 వికెట్లు తీశాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
విజయానంద్: 113 (జమీర్ 3/39, అంబాదాస్ 3/20); నవజీవన్ ఫ్రెండ్స్: 85 (అనీష్ రెడ్డి 3/24).
రెడ్ హిల్స్: 164 (అద్నాన్ 37, అఫ్రోజ్ 34; మజీద్ సుల్తాన్ 3/29); ఎలిగెంట్: 143 (ఆజింక్యా పాటిల్ 43; అంజద్ 3/43).
హైదరాబాద్ ప్యాంథర్స్ ఎలెవన్: 260/9 (జీషన్ అలీ ఖాన్ 31, హైదర్ 45, ఆసిఫ్ మొహమ్మద్ 40, జీషాన్ 32 నాటౌట్; బాలు 4/55); ఆర్బీఐ: 124 (షేక్ నియమతుల్లా 34; సయ్యద్ ఇమ్రాన్ 3/33).
డెక్కన్ వాండరర్స్: 202 (అజీముద్దీన్ 65, మెహబూబ్ 48; హాజి 4/24); సౌతెండ్ రేమండ్స్: 139 (ఇమ్రోస్ 3/7).