Amar Raja Group
-
Amara Raja: చట్ట ప్రకారమే ముందుకెళ్లండి: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా.. షోకాజ్ నోటీస్ పై పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే.. పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని అమర్ రాజాకు సూచించింది న్యాయస్థానం. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. ఈ తరుణంలో న్యాయస్థానం.. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే అని స్పష్టం చేసింది. అమర్ రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి. జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై.. గతంలో అధికారుల విధులను అడ్డుకున్నందుకు పోలీసు కేసు నమోదైంది. -
గన్ షాట్ : ఏపీ కంపెనీలపై ఎల్లో మీడియా విషం కక్కుతుందా ..!
-
బరితెగించిన అమర రాజా ఫ్యాక్టరీ యాజమాన్యం
-
అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై పోలీసు కేసు నమోదైంది. ఆ ఫ్యాక్టరీలో కాలుష్యం శాతం ఏ మేరకు ఉందో పరిశీలించేందుకు వచ్చిన చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను అడ్డుకున్నందుకు గాను అమర్‌రాజా బ్యాటరీ ఇండస్ట్రీస్‌పై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో ఉన్న అమర్‌రాజా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం శాతం, దాని ప్రభావాలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పరిశీలన చేపట్టింది. ఈ క్రమంలో ఫ్యాక్టరీల ఎన్విరాన్మెంటల్ ఆడిటింగ్‌తో పాటు కాలుష్య శాతం ఏ మేరకు ఉందో అధ్యయనం చేయాలని చెన్నైకి చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)కి కాంట్రాక్ట్ అప్పగించింది. ఈ నెల 3వ తేదీన చెన్నై నుంచి వచ్చిన ఐఐటీ నిపుణుల బృందం సభ్యులు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది ఐఐటీ నిపుణులను లోనికి అనుమతించలేదు. అమర్‌రాజా ఫ్యాక్టరీస్ డీజీఎంగా పనిచేస్తున్న ఎన్.గోపీనాథరావుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (పీసీబీ) తరఫున వచ్చామని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు పీసీబీ ఈఈ నరేంద్రబాబు వచ్చినా లోనికి అనుమతించలేదు. దీంతో పీసీబీ ఈఈ నరేంద్రబాబు ఈ నెల 16వ తేదీన రేణిగుంట పోలీస్ స్టేషన్లో సదరు ఫ్యాక్టరీల నిర్వాకంపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు శనివారం తెలిపారు. -
అమరరాజా బ్యాటరీస్ నాయకత్వ మార్పు
రేణిగుంట (చిత్తూరు జిల్లా): అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్ హోదా నుంచి తప్పుకోనున్నారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్ కొత్త చైర్మన్‌గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. జయదేవ్ ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. రామచంద్రనాయుడు .. చైర్మన్‌గా పునర్నియామకాన్ని కోరరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆగస్టులో జరిగే వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) దాకా ఆయన డైరెక్టర్, చైర్మన్ హోదాలో కొనసాగనున్నారు. ఆ తర్వాత చైర్మన్‌గా జయదేవ్ బాధ్యతలు చేపడతారు. 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి, అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని రామచంద్రనాయుడు పేర్కొన్నారు. అటు, నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవికి గౌరినేని రమాదేవి రాజీనామాను బోర్డు ఆమోదించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా గౌరినేని హర్షవర్ధన్, గౌరినేని విక్రమాదిత్య.. స్వతంత్ర డైరెక్టర్‌గా అనుష్ రామస్వామి నియామకాలకు ఆమోదం తెలిపింది. మరోవైపు, పర్యావరణ అనుకూల టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు జయదేవ్ వెల్లడించారు. ఇందుకోసం లిథియం అయాన్ బ్యాటరీలు, ఈవీ చార్జర్లు మొదలైన వాటికోసం కొత్తగా ’ఎనర్జీ ఎస్‌బీయూ’ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
రూ.200ల కోట్లతో ప్లాస్టిక్ పరిశ్రమ ప్రారంభం
అమరరాజ గ్రోత్ కారిడర్‌లోని మంగళ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా యాదమరి మండలం ముత్తరపల్లె గ్రామం వద్ద రూ.200ల కోట్లతో ఏర్పాటుచేసిన ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఫెసిలిటీ పరిశ్రమను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరరాజ గ్రూప్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు మాట్లాడుతూ అమరరాజ గ్రూపు తరపున 1985లో తిరుపతి కరకంబాడి వద్ద బ్యాటరీల ప్యాక్టరీని ప్రారంభించామన్నారు. ఇప్పటివరకు ఆరు ప్రాంతాల్లో 16 బ్రాంచ్‌లు ఏర్పాటుచేసి 14 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. ప్రస్తుతం అమరరాజ గ్రూపులో మంగళ్ ఇండ స్ట్రీస్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. బ్యాటరీలకు అవసరమయే ప్లాస్టిక్ వస్తువులు అందంగా, నాణ్యంగా తయారు చేయడానికి 1991లో మొట్టమొదట చిత్తూరు జిల్లా పూతలపట్టు పేటమిట్ట గ్రామం వద్ద ప్రారంభించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు స్థాపించి అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఆ ప్రాంతాలు ఎన్నుకున్నట్లు తెలిపారు. తరువాత తిరుపతి కరకంబాడి వద్ద ప్రారంభించామన్నారు. హైక్వాలిటీతో ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తుండడంతో పలు దేశాల నుంచి పలు కంపెనీలు అడగడంతో పలు ఫ్యాక్టరీలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే బుధవారం యాదమరి మండలంలో ముత్తర పల్లె వద్ద రూ.200 కోట్లతో ప్రారంభించి అందులో 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు. అందరి సహకారంతో మరిన్ని ప్యాక్టరీలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, మంగళ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎండీ గల్లా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.