amaranatha Reddy
-
కూటమి హవాను తట్టుకుని...
పుంగనూరు/పాడేరు/పార్వతీపురం టౌన్: చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. పెద్దిరెడ్డికి 99,774 ఓట్లు రాగా.. 6,619 ఓట్ల మెజార్టీ లభించింది. టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 93,155 ఓట్లు లభించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు 19,338 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 68,170 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 48,832 ఓట్లు వచ్చాయి.అరకు అసెంబ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మత్స్యలింగంకు 65,658 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుకు 33,781 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోశన్నపై 18,567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంపై 7,016 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.నాలుగోసారి బాలనాగిరెడ్డి విజయబావుటా కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి నాలుగోసారి విజయబావుటా ఎగురవేశారు. బాలనాగిరెడ్డి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్.రాఘవేంద్రరెడ్డి 74,857 ఓట్లు దక్కించుకున్నారు. బాలనాగిరెడ్డికి 12,805 ఓట్ల మెజార్టీ లభించింది. ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి బూసినె విరుపాక్షి విజయం సాధించారు.టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, రీకౌంటింగ్ చేయాలని టీడీపీ ఏజెంట్లు పట్టుబట్టారు. ప్రతీ రౌండ్లోనూ ఏజెంట్లు సంతకాలు చేశాకే.. ఆ తర్వాతి రౌండు లెక్కించారు. దీంతో ఎన్నికల అధికారి సృజన రీకౌంటింగ్‌ను తిరస్కరించారు. తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి టీడీపీ నుంచి అభ్యర్థి జయచంద్రారెడ్డిపై 10,103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. -
ఐడీ కార్డులు చూపించాలంటూ టీడీపీ మాజీ మంత్రి దాదాగిరి
సాక్షి, చిత్తూరు: రామకుప్పం మండలంలో టీడీపీ నాయకులు బరితెగించారు. కుప్పంలో సోమవారం మున్సిపల్ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరిస్తూ ప్రలోభపెడుతున్నారు. సల్దిగానిపల్లె వద్ద వాహనాలను ఆపి ప్రయాణికుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారందరినీ ఐడీ కార్డులు చూపించాలంటూ దాదాగిరి చేశారు. రోడ్డుపై బైఠాయించి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. వీరిని అడ్డుకున్న పోలీసులపై కూడా ఆయన అనుచరులు దాడికి తెగబడ్డారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చదవండి: (కుప్పంలో టీడీపీ అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు) -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ
సాక్షి, వి.కోట: అధికార, ప్రతిపక్షాల కార్యకర్తలు కొట్టుకోవడం చూశాం.. చంపుకోవడం చూశాం.. కానీ ఇక్కడి పరిస్థితి విభిన్నంగా ఉంది. వైఎస్సార్ సీపీ నాయకులు సీఎం వైఎస్ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారనడానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ నిదర్శనం. గురువారం వి.కోటలో టీడీపీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్త ఓబుల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అదే మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ ఇది చూసిన వెంటనే స్పందించారు. ఓబుల్ రెడ్డిని కూర్చోబెట్టి, అతనికి ధైర్యం చెప్పి, వెంటనే స్ట్రెచర్ మీద ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించిన ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకున్నారు. -
రాయల తెలంగాణ ప్రతిపాదనతో రాక్షసానందం
=సీఎం, చంద్రబాబు భావితరాల విలన్లు =రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే జగన్ తాపత్రయం =వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సాక్షి, తిరుపతి : రాయల తెలంగాణను తెరపైకి తెచ్చి రాక్షసానందం పొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, శ్రీని వాసులు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు రాయల తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని చెప్పారు. ఆ ప్రతిపాదన తీసుకువస్తే, ప్రజలే వీరి నాలుకలు తెగ్గోస్తారని హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు కారణమైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు భావితరాల దృష్టిలో విలన్లు కావడం ఖాయమన్నారు. కర్ణాటక రా ష్ట్రంతో ఇప్పటికే కృష్ణా జలాల సమస్యను ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన గాలేరు- నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీఎం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విరుచుకుపడ్డారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇందు లో భాగంగానే ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తం గా ఆయన పర్యటించి, అన్ని జాతీయ పార్టీల నాయకులను కలుసుకుంటారని చెప్పారు. సమైక్య ఉద్యమాన్ని రాష్ట్రపతి గుర్తించాలని కో రారు. విభజన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావాలనే జగన్మోహన్రెడ్డి పిలుపు కు ఆయా పార్టీల నాయకులు స్పందించాలని కోరారు. విభజన బిల్లు శాసనసభకు వస్తే అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. యూపీఏ ఇస్తున్న ప్యాకేజీలు సీమాంధ్రలో అమలవుతాయనే నమకం ఏముందని ప్రశ్నించారు.