
గాయపడిన ఓబుల్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తున్న పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ
సాక్షి, వి.కోట: అధికార, ప్రతిపక్షాల కార్యకర్తలు కొట్టుకోవడం చూశాం.. చంపుకోవడం చూశాం.. కానీ ఇక్కడి పరిస్థితి విభిన్నంగా ఉంది. వైఎస్సార్ సీపీ నాయకులు సీఎం వైఎస్ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారనడానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ నిదర్శనం. గురువారం వి.కోటలో టీడీపీ మాజీ మంత్రి అమరనాథ రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్త ఓబుల్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అదే మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే వెంకటేగౌడ ఇది చూసిన వెంటనే స్పందించారు. ఓబుల్ రెడ్డిని కూర్చోబెట్టి, అతనికి ధైర్యం చెప్పి, వెంటనే స్ట్రెచర్ మీద ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించిన ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకున్నారు.