ambarupeta
-
ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల ఎడ్ల పూటీ లాగుడు పోటీలు
నందిగామ రూరల్ : మండల పరిధిలోని అంబారుపేట గ్రామంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య శుక్రవారం సాయంత్రం పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం మూడు రోజులపాటు పోటీలు కొనసాగనున్నాయి. తొలి రోజు 58 అంగుళాలలోపు సైజు ఎడ్లకు పోటీ జరిగింది. ఒకటిన్నర క్వింటాళ్ల బరువును లాగేందుకు మొత్తం 15 ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. ఆరున్నర నిముషాల సమయం వీటికి కేటాయించారు. ఆద్యంతం ఈ పోటీలు ఆసక్తికరంగా, ఆహ్లాదంగా సాగాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు. -
శాకంబరిదేవిగా సత్యమ్మ
అంబారుపేట (నందిగామ రూరల్) : అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించిన శాకంబరి ఉత్సవాలు ముగిశాయని, అమ్మవారిని అలంకరించిన కూరగాయలతో తయారు చేసిన వంటలతో శుక్రవారం భారీ అన్న సమారాధన జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి మన్నెం నరసింహారావు కోరారు. 21ఎన్డిజిఎమ్02 ః శాకంబరిదేవి అలంకారంలో సత్యమ్మ అమ్మవారు