ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల ఎడ్ల పూటీ లాగుడు పోటీలు | bulls competitions | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల ఎడ్ల పూటీ లాగుడు పోటీలు

Published Fri, Dec 9 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల ఎడ్ల పూటీ లాగుడు పోటీలు

ప్రారంభమైన ఉభయ తెలుగు రాష్ట్రాల ఎడ్ల పూటీ లాగుడు పోటీలు

నందిగామ రూరల్‌ : మండల పరిధిలోని అంబారుపేట గ్రామంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభమయ్యాయి. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య శుక్రవారం సాయంత్రం పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం మూడు రోజులపాటు పోటీలు కొనసాగనున్నాయి. తొలి రోజు 58 అంగుళాలలోపు సైజు ఎడ్లకు పోటీ జరిగింది. ఒకటిన్నర క్వింటాళ్ల బరువును లాగేందుకు మొత్తం 15 ఎడ్ల జతలు పోటీ పడ్డాయి. ఆరున్నర నిముషాల సమయం వీటికి కేటాయించారు. ఆద్యంతం ఈ పోటీలు ఆసక్తికరంగా, ఆహ్లాదంగా సాగాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement