Amir Hussain
-
మాట నిలబెట్టుకున్న సచిన్..!
-
క్రికెట్ దేవుడే దిగి వస్తే...
కశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్ జీవితం వెలిగింది. రెండు చేతులూ లేకపోయినా మెడతో బ్యాట్ పట్టి ఆడే అమిర్ తనను ఇన్‌స్పయిర్ చేసిన క్రికెట్ దేవుడు సచిన్‌ని జీవితంలో కలుస్తాననుకోలేదు. కలిశాడు. అంతేనా? సచిన్ నుంచి ఊహించని బహుమతి అందుకున్నాడు. ఈ వివరం ఏమిటంటే... సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. ఇది అతని తొలి కశ్మీర్ పర్యటన అని భోగట్టా. అక్కడి ‘చార్సో’ అనే ఊళ్లో ఉండే బ్యాట్ల తయారీ కేంద్రాన్ని సచిన్ సందర్శించాడు. అంతే కాదు... అక్కడి ‘బిజ్బెహరా’ ్రపాంతానికి చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్‌ను తన హోటల్‌కు పిలిపించుకుని ప్రత్యేకంగా కలిశాడు. అమిర్ హుసేన్ ప్రస్తుతం కశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. పుట్టుకతో చేతులు లేని అమిర్ తన జీవితంలో పేర్కొన్న నిరాశను సచిన్‌ను చూసి ఇన్‌స్పయిర్ అయి క్రికెటర్ కావడంతో పోగొట్టుకున్నాడు. బ్యాట్‌ను మెడ, భుజాల మధ్య పట్టి అతను క్రికెట్ ఆడతాడు. ఈ స్ఫూర్తిమంతమైన గాధను విన్న సచిన్ తన పర్యటన సందర్భంగా అమిర్ హుసేన్‌ను కలిశాడు. ‘నిన్ను కలవడం సంతోషం’ అని ‘ఎక్స్’లో తానే పోస్ట్ పెట్టాడు. సచిన్‌ని చూడగానే ఇలాంటిది తన జీవితంలో జరిగిందా అన్నట్టుగా భావోద్వేగంతో కదిలిపోయాడు అమిర్. ‘ఇలాగే నువ్వు మమ్మల్ని ఇన్‌స్పయిర్ చేయి’ అని అమిర్‌తో సచిన్ చె΄్పాడు. అంతేనా? తను సంతకం చేసిన బ్యాట్ ఇచ్చి అమిర్‌ని తబ్బిబ్బు చేశాడు. -
రియల్ హీరోకు సచిన్ బహుమతి.. ఎమోషనల్ వీడియో వైరల్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. భూతల స్వర్గంలో గల్లీ క్రికెట్ ఆడుతూ, జవాన్లను పలకరిస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నాడు. Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV — Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024 కుటుంబంతో కలిసి కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండుల్కర్ తాజాగా షేర్ చేసిన వీడియో అభిమానుల హృదయాలను తాకింది. ఇంతకీ అందులో ఏముంది?!... జమ్మూ కశ్మీర్‌కు చెందిన అమిర్ హుసేన్ లోనీ అనే దివ్యాంగ క్రికెటర్ పేరు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అమిర్.. దురదృష్టవశాత్తూ ఎనిమిదేళ్ల వయసులో ఓ ప్రమాదంలో రెండు చేతులను పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ ధైర్యం కూడదీసుకుని.. అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను దాటుకుంటూ.. రాష్ట్ర పారా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు. రెండు చేతులు లేకున్నా తన మెడ భాగం, భుజం మధ్య బ్యాట్ పెట్టకుని క్రికెట్ ఆడే అమిర్.. కాళ్లతో బౌలింగ్ చేయగలడు. And Amir has made the impossible possible. I am so touched watching this! Shows how much love and dedication he has for the game. Hope I get to meet him one day and get a jersey with his name. Well done for inspiring millions who are passionate about playing the sport. https://t.co/s5avOPXwYT — Sachin Tendulkar (@sachin_rt) January 12, 2024 ఈ క్రమంలో అమిర్ హుసేన్ గురించి తెలుసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ఆట పట్ల అతడి అంకిత భావానికి ఫిదా అయ్యాడు. అమిర్‌ను కలిసే అవకాశం వస్తే.. అతడి పేరుతో ఉన్న జెర్సీని అడిగి మరీ బహుమతిగా అందుకుంటానని సచిన్ పేర్కొన్నాడు. తాజాగా తన పర్యటనలో భాగంగా అమిర్ హుసేన్‌ను కలిశాడు సచిన్. తన సంతకంతో కూడిన బ్యాట్‌ను అతడికి గిఫ్టుగా ఇచ్చాడు. అంతేకాదు.. అమిర్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో అడిగి మరీ మెళకువలు నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. ‘‘అమిర్ నిజమైన హీరో.. నువ్విలాగే ఎల్లప్పుడూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి. నిన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని సచిన్ టెండుల్కర్ క్యాప్షన్ జతచేశాడు. ఈ నేపథ్యంలో అమిర్ హుసేన్తో పాటు అతడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న సచిన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి! To Amir, the real hero. Keep inspiring! It was a pleasure meeting you. pic.twitter.com/oouk55lDkw — Sachin Tendulkar (@sachin_rt) February 24, 2024 -
కాలితో బౌలింగ్...భుజంతో బ్యాటింగ్
కశ్మీర్: ఈ సమాజంలో చేతులు లేని వాళ్లు కాళ్లతో తమ పనులు తాము చేసుకోవడం, బలపం పట్టి దిద్దడం, పెన్ను పట్టి రాయడం, చదువులో ఫస్ట్ రావడం మనం చూశాం. చూస్తున్నాం. 26 ఏళ్ల అమీర్ హుస్సేన్ లోన్ వారందరికన్నా ముందున్నారు. రెండు చేతులు భుజాల వరకు లేకున్నా క్రికెట్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. కుడికాలు పెకైత్తి ఎంచక్కా బౌలింగ్ వేస్తారు. భుజానికి, గదమకు మధ్య క్రికెట్ బ్యాట్ పట్టుకొని బ్యాటింగ్ చేస్తారు. ఆ బ్యాట్‌ను అలాగే పట్టుకొని పరుగులు తీస్తారు. హుస్సేన్ ఎవరి సాయం లేకుండా తన పనులను తానే చేసుకుంటారు. స్నానం చేసి బట్టలు వేసుకోవడం దగ్గరి నుంచి గడ్డం గీసుకోవడం, కాలేజీకెళ్లి చదువుకోవడం. కాలుతో పెన్ను రాయడం లాంటి పనులు తేలిగ్గా చేసుకుంటారు. హుస్సేన్ ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రి కట్టెల కోత మిషన్‌లో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు రెండు చేతులు తెగిపోయాయి. మిగిలిన చేతుల భాగాలను శస్త్ర చికిత్సలో తీసివేయాల్సి వచ్చింది. ట్రీట్మెంట్కు ఎంతో ఖర్చయింది. ఆ ఖర్చును భరించేందుకు ఆయన తండ్రి తమకున్న పొలాన్ని అమ్మేయాల్సి వచ్చింది. భుజాల వరకు రెండు చేతులు లేకుండా మనుగడ సాగించడం హుస్సేన్‌కు మొదట్లో కష్టమైంది. చదువుకోవడానికి స్కూల్‌కు వెళితే ‘నీవు చదువుకు పనికి రావు’ అంటూ స్కూల్ నుంచి వెళ్లగొట్టారు. అయినా అందరితోపాటు తాను చదవగలను, రాయగలనని అనతికాలంలోనే కాశ్మీర్‌కు చెందిన ఈ హుస్సేన్ నిరూపించి పాఠశాలలో చేరారు. ప్రస్తుతం కాశ్మీర్ పారా క్రికెట్ అసోసియేషన్‌లో సభ్యుడయ్యారు. తన ఆట తీరుతో అభిమానులను కూడా సంపాదించుకున్నారు. బలమైన సంకల్పం, ఎంతటి అకుంఠిత దీక్ష ఉంటే తప్పా ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం మానవ స్ఫూర్తికే స్ఫూర్తిగా నిలుస్తున్న హుస్సేన్ వీడియోను ప్రత్యక్షంగా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.