amit katariya
-
దేశంలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్.. జీతం రూపాయి!
దేశంలో ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వారి నేపథ్యం, వ్యక్తిగత విషయాలపైనా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తుంటారు. వారిలో హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా ఒకరు. ఇటీవల ఆయన వార్తల్లోకి వచ్చారు.ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న అమిత్ కటారియా దేశంలోనే అత్యంత సంపన్న ఐఏఎస్ అధికారులలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. ఈ ప్రత్యేకత గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. అంత సంపన్నుడైన ఆయన సర్వీస్‌లో చేరిన కొత్తలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జీతంగా తీసుకున్నారు. దీంతో ప్రజాసేవ పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు.అమిత్ కటారియా విద్యా నేపథ్యం కూడా అద్భుతంగా ఉంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. కటారియా తన పాఠశాల విద్యను ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యారు. 2003లో యూపీఎస్ఈ పరీక్షలో 18వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చోటు సంపాదించారు.ఉన్నత వ్యాపార కుటుంబంఅమిత్ కటారియా రియల్ ఎస్టేట్‌లో స్థిరపడిన వ్యాపార కుటుంబం నుండి వచ్చారు. వీరికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో మంచి లాభాలు ఇస్తున్న వెంచర్లు ఉన్నాయి. సంపన్నుడైనప్పటికీ కటారియా తన కెరీర్ ప్రారంభంలో సర్వీస్‌లో చేరిన తర్వాత కేవలం రూపాయి వేతనం తీసుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు.అయితే కొన్ని సందర్భాలలో తన చర్యలతో వివాదాస్పదమూ అయ్యారు. 2015లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా స్వాగతం పలుకుతూ సన్ గ్లాసెస్ ధరించడం వివాదాస్పదం అయ్యింది. దీన్ని ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది.ఇక వ్యక్తిగత విషయానికి వస్తే అమిత్ కటారియా కమర్షియల్ పైలట్ అయిన అశ్మిత హండాను వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా తమ వ్యక్తిగత విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కాగా అమిత్ కటారియా నెట్‌వర్త్ సుమారు రూ.8.90 కోట్లని అంచనా. -
40 డిగ్రీల ఎండలో సూటా?
ప్రోటోకాల్‌కు విరుద్దంగా ప్రధాని పర్యటనలో నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్ ధరించి, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించిన ఐఏఎస్ అధికారి, బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియా ఎట్టకేలకు వివాదంపై స్పందించారు. నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ డ్రెస్‌లో ప్రధానికి షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని సమర్థించుకున్నారు. 'దేశంలో అత్యధికి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో బస్తర్ కూడా ఒకటి. 40 డిగ్రీల ఎండలో.. బంద్గలా లేదా నార్మల్ సూటు ధరించి ఉక్కపోతను అనుభవిస్తూ విధులు నిర్వర్తించడం నావల్ల కాదు బాబోయ్..' అంటూ వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ఐఏఎస్ సహచరులతో తన గోడు వెలిబుచ్చుకున్నాడు. 'అయినా నేనేమీ టీషర్లు, స్లిప్పర్సు ధరించానా? బ్లూ షర్లు, బ్లాక్ ప్యాంటు, షూ.. ఇలా కంప్లీట్ ఫార్మల్ వేర్ లో ఉండటం తప్పెలా అవుతుంది?' అని మనసులో మాటను మిత్రులతో పంచుకున్నారు. అసలీ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పట్టించుకోలేదని, ఆయన తనకు 'హలో' చెప్పారని, మీడియానే ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేసిందని అమిత్ కటారియా పేర్కొన్నారు. గతవారం ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ 24 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనలో ప్రోటోకాల్ కు విరుద్ధంగా నల్ల కళ్లద్దాలు, ఫార్మల్ దుస్తులు ధరించినందుకు బస్తర్ కలెక్టర్ అమిత్ కటారియాకు ఛత్తీస్‌గఢ్ సర్కారు నోటీసులు కూడా జారీచేసింది. -
సన్ గ్లాసెస్ కష్టాలు..
-
నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు
రాయ్‌పూర్: నీలి రంగు చొక్కా.. నలుపు రంగు ప్యాంటు.. నల్ల కళ్లజోడు ధరించి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి షేక్ హ్యాండ్ ఇస్తోన్న ఆ వ్యక్తి.. బస్తర్ జిల్లా కలెక్టర్. పేరు అమిత్ కటారియా. చూడటానికి ఠీవిగా అనిపించినా.. ఆయన అలా కళ్లజోడుతో పీఎంను కలుసుకోవడం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. అసలు నల్ల కళ్లజోడు ధరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటూ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు కలెక్టర్ అమిత్ కటారియా. ఇంతకీ విషయం ఏమంటే.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలను కలిసినప్పుడు సివిల్ సర్వీసు అధిరాలు ఎవరైనాసరే నల్ల కళ్లజోడు ధరించరాదన్నది ప్రోటోకాల్ నియమం. ఆ నియమాన్ని ఉల్లంఘించినందుకే సదరు అధికారికి నోటీసులు. గత శనివారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. నక్సల్స్ ప్రభావిత బస్తర్ జిల్లాలో భారీ బహిరంగసభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా 24 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.