నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు | Chhattisgarh government issues notice to IAS officer for wearing dark glasses | Sakshi
Sakshi News home page

నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు

Published Fri, May 15 2015 1:10 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు

నల్లకళ్లద్దాలు పెట్టుకున్నందుకు నోటీసులు

రాయ్పూర్: నీలి రంగు చొక్కా.. నలుపు రంగు ప్యాంటు.. నల్ల కళ్లజోడు ధరించి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి షేక్ హ్యాండ్ ఇస్తోన్న ఆ వ్యక్తి.. బస్తర్ జిల్లా కలెక్టర్. పేరు అమిత్ కటారియా. చూడటానికి ఠీవిగా అనిపించినా.. ఆయన అలా కళ్లజోడుతో పీఎంను కలుసుకోవడం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. అసలు నల్ల కళ్లజోడు ధరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటూ శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు కలెక్టర్ అమిత్ కటారియా.

ఇంతకీ విషయం ఏమంటే.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వీవీఐపీలను కలిసినప్పుడు సివిల్ సర్వీసు అధిరాలు ఎవరైనాసరే నల్ల కళ్లజోడు ధరించరాదన్నది ప్రోటోకాల్ నియమం. ఆ నియమాన్ని ఉల్లంఘించినందుకే సదరు అధికారికి నోటీసులు. గత శనివారం ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని మోదీ.. నక్సల్స్ ప్రభావిత బస్తర్ జిల్లాలో భారీ బహిరంగసభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా 24 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement