అక్షరధామ్పై దాడి నిందితుల విడుదల
స్వాగతించిన ముంబై న్యాయవాదులు
ముంబై: గాంధీనగర్లోని అక్షరధామ్ దేవాలయంపై ఉగ్రవాదుల దాడికేసులో ఆరుగురు నిందితులను సుప్రీం కోర్టు విడుదల చేయడాన్ని ముంబై న్యాయవాదులు స్వాగతించారు. ప్రభుత్వ న్యాయవాది నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో ఆరుగురు నిందితులను విడుదల చేశారని జమాయత్ ఉలేమా ఇ మహారాష్ట్ర (జేయూఈఎమ్)న్యాయవాది గుల్జార్ అజ్మీ తెలిపారు. ఆ సంస్థ నిందితుల తరపున ఉచితంగా వాదించింది. పోటా చట్టం కింద తప్పుడు కేసులు బనాయిస్తూ, ఆ తరువాత గుజరాత్ కోర్టు శిక్షకు గురవుతున్న అమాయక ముస్లిం యువత కేసులు వాదించడం కోసం జేయూఈఎమ్ పనిచేస్తోంది. ఇందులో పలువురు ప్రముఖ క్రిమినల్ న్యాయవాదులతోపాటు మాజీ సొలిసిటర్ జనరల్ అమ్రిందర్ శరణ్ కూడా ఉన్నారు.
ప్రధానిగా నరేంద్రమోడీ ఎన్నికవ్వడం గుజరాత్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని అన్నారు. శిక్షకు వ్యతిరేకంగా నిందితుల అభ్యర్థనను స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సహేతుక సందే హం కింద... వారిమీద ఎలాంటి నేరారోపణ చేయలేకపోవడంతో ఆరుగురిని విడుదల చేసింది. ఆరుగురు నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల కారాగార శిక్ష పడిన సంగతి విదితమే.