anandam movie
-
సీరియల్ యాక్టర్‌గా మారిన బ్లాక్ బస్టర్ మూవీ హీరో
2001లో విడుదలైన తెలుగు సినిమా ఆనందం మీకు గుర్తుందా? ఆ సినిమాలో హీరో మీకు గుర్తున్నారా? అతనేనండి జై ఆకాశ్. ఆ ఆనందం హీరో ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? అతను త్వరలోనే ఓ తెలుగు సీరియల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. మీరు విన్నది నిజమే. అప్పుడు సినిమా హీరో.. ఇప్పుడు సీరియల్ హీరోగా మరోసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీరియల్ సెట్స్‌లో చిత్రాలను ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అక్కడే జై ఆకాశ్‌తో పాటు మోనిషా, జబర్దస్త్ ఫేమ్ సన్నీ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా.. జై ఆకాశ్ తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించారు. శ్రీలంకలో జన్మించిన ఆకాశ్ ఆ తర్వాత యూకేలోని లండన్‌లో స్థిరపడ్డారు. కె బాలచందర్ నిర్మించిన రోజావనం (1999) చిత్రంలో రెండో ప్రధాన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఆ తర్వాత 2001లో వచ్చిన ఆనందం చిత్రంతో తెలుగులో అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. పలు తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఆకాశ్ చివరిసారిగా 2010లో నమో వెంకటేశ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మరోసారి తెలుగు చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. జై ఆకాశ్ నటించిన రాబోయే డైలీ కొత్త టీవీ షో పేరు 'గీతాంజలి'లో నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బుల్లితెర నటి సుజిత ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Jai Akash (@jaiakash252) -
ఆ కారణంగానే హీరో ఆకాశ్ సినిమాలకు దూరమయ్యాడా?
‘ఆనందం’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన హీరో ఆకాశ్. అప్పటికే అతడు పలు సినిమాల్లో నటించినప్పటికి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం మూవీ ఆయనకు కమర్షియల్ హిట్‌ను అందించింది. ఈ మూవీతో జై ఆకాశ్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇందులో హీరోయిన్‌తో గొడవ పడుతూ, తండ్రికి భయపడే కుమారుడిగా ఆకాశ్ లేడీ ఫ్యాన్స్ ఆకట్టుకున్నాడు. ఇందులో తన హేర్‌స్టైల్, స్టైలిష్ లుక్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఆనందం మూవీ సమయంలో ఆకాశ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వరుస సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆకాశ్ హీరోగా ఎక్కువ కాలం రాణించలేకపోయాడు. అయితే దీనికి కారణం తనకు వచ్చిన స్టార్ స్టేటస్‌ను చూసుకుని దర్శక-నిర్మాతలను తన డిమాండ్లతో ఇబ్బంది పెట్టడమే అని సినీ వర్గాల అభిప్రాయం. జై ఆకాశ్ అసలు పేరు.. సతీష్ నాగేశ్వరన్. శ్రీలంక తమిళ కుటుంబం నుంచి 1981 మార్చి 18న కొలంబోలో జన్మించాడు. విద్యాభ్యాసమంతా శ్రీలంకలో చేశాడు. పై చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడ స్థిరపడిన ఆకాశ్ సినిమాలపై ఆసక్తితో చెన్నై వచ్చాడు. ఈ క్రమంలో ‘రోజా వనం’ అనే తమిళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగులో సుమంత్ హీరో వచ్చిన ‘రామ్మా చిలకమ్మ’లో సైడ్ హీరోగా చేశాడు. ఆ వెంటనే ‘ఆనందం’ సినిమాలో మెయిన్ హీరోగా నటించే చాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళ పరిశ్రమల్లో పలు సినిమాలు చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా నంది అవార్డుతో పాటు పలు పురస్కారాలు అందుకున్న ఆకాశ్ ఎక్కువ కాలం హీరోగా రాణించలేకపోయాడు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే దర్శకుడిగా మారాడు. తమిళం, తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే స్వయంగా దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్ నిషాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు అంత బాగానే ఉంది. కానీ తను నిర్మించిన చిత్రాలు అన్ని బాక్సాఫీసు వద్ద అంతగా రాణించలేదు. అలాగే తన యాటిట్యూడ్‌తో వచ్చిన సినిమా అవకాశాలు పోగొట్టుకోవడం, నటించిన సినిమాలు విడుదల కాకపోవడంతో నటుడిగా ఆకాశ్ కేరీర్ డౌన్ అయ్యింది. ఇక నిర్మాతగా తాను సంపాదించుకున్న ఆస్తులతో పాటు ఉన్న ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు. ఆర్థికంగా నష్టపోయాడు. అయితే ఒక్క సినిమా హిట్‌కే పెద్ద స్టార్‌నని ఫీల్ అవుతూ డైరెక్టర్స్ దగ్గర గొంతెమ్మ కోరికలు కోరేవాడట. సోనాలి బింద్రే, సిమ్రాన్ వంటి స్టార్ హీరోయిన్లు అయితేనే నటిస్తానని డిమాండ్ చేయడంతో ఆకాశ్‌కు అవకాశాలు వెనక్కిపోయేవట. దీంతో కొంతకాలం నటనకు దూరమై తెరపై కనుమరుగైన ఆకాశ్ ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తనదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరపైకి వచ్చాడు. తన సినిమాను పూరి దొంగలించారని, నష్టపరిహరంగా 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే దీనిపై పూరి ఇంతవరకు స్పందించలేదు. ఈ క్రమంలో ఆకాశ్ ఆర్థికంగా నష్టపోయాడని, డబ్బు, ఫేం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు నెటిజన్లు, పూరి అభిమానులు ఆకాశ్‌ను విమర్శించారు. దీంతో వాటిపై స్పందించిన ఆకాశ్..తనకు లండన్‌లో సొంతంగా 2, 3 పెట్రొల్ బంక్‌లు, సూపర్ మార్కెట్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే తెలుగు పరిశ్రమ తనని దారుణంగా మోసం చేసిందంటూ ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు. -
‘ఆనందం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆనందం జానర్ : యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తారాగణం : అరుణ్, థామస్ మాథ్యూ, రోషన్, విశాఖ్ నాయర్, అను ఆంటోని, సిద్ధి మహాజన్‌కట్టి సంగీతం : సచిన్ వారియర్ దర్శకత్వం : గణేష్ రాజ్ నిర్మాత : ఎ.గురురాజ్ యూత్ ఫుల్ఎంటర్టైనర్లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. యువతరానికి నచ్చే అంశాలకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తుంటాయి. ఆ నమ్మకంతోనే 2016లో మలయాళంలో ఘన విజయం సాధించిన ఆనందం సినిమాను ఇప్పుడు అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ అతిథి పాత్రలో నటించటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? కథ : కంప్యూటర్ సైన్స్ ఇంజీనిరింగ్ చదివే విద్యార్థులు కాలేజ్ తరుపున ఇండస్ట్రియల్ విజిట్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ టూర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చాలా ప్లాన్స్ వేస్తారు. కాలేజ్ మేనేజ్మెంట్ సౌత్ ఇండియా వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వటంతో ముందు హంపీ వెళ్లి తరువాత గోవాలో న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. (సాక్షి రివ్యూస్) ప్రధానంగా ఏడుగురు విద్యార్థుల చుట్టూనే కథ నడుస్తుంది. విభిన్న వ్యక్తిత్వాలున్న ఆ విద్యార్థులకు ఈ టూర్ ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది..? వారిలో వ్యక్తిత్వాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : నటీనటులంతా కొత్తవారే.. ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగులో ఇలాంటి కాలేజ్ కథలు చాలానే వచ్చాయి. హ్యాపీడేస్ లాంటి సినిమాలు దాదాపుగా ఇలాంటి కాన్పెప్ట్ తో తెరకెక్కినవే. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈ కథలో పెద్దగా కొత్తదనమేమి కనిపించదు. బలమైన కథ లేకపోవటంతో దర్శకుడు.. స్టూడెంట్స్ చేసే అల్లరితోనే సినిమాను నడిపించాడు. (సాక్షి రివ్యూస్)బలమైన సన్నివేశాలు, ఆయడిన్స్‌ను కథలో ఇన్వాల్స్చేసే ట్విస్ట్‌లు ఒక్కటి కూడా సినిమాలో కనిపించవు. బలమైన ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్న సన్నివేశాలను కూడా దర్శకుడు సింపుల్ గా తేల్చేయటం నిరాశకలిగిస్తుంది. సంగీతం కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. ఆనంద్ సీ చంద్రన్ సినిమాటోగ్రఫి బాగుంది. హంపీలోని లోకేషన్స్‌ను, గోవాలో పార్టీ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి కొన్ని సరదా సన్నివేశాలు మైనస్ పాయింట్స్ : కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
మరో ‘ఆనందం’తో పూర్వవైభవం?
‘ఆనందం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్ మళ్లీ ఆ స్థాయి విజయాన్ని ఆశిస్తూ, చేసిన చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. ‘ఆనందం’ సీక్వెల్‌గా ఆకాశ్ దర్శకత్వంలోనే ఎన్.జె. రత్నావత్ నిర్మించారు. మాజీ మిస్ ముంబయ్ ఏంజెల్ సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆకాశ్ మాట్లాడుతూ -‘‘ఇటీవల చేసిన కొన్ని చిత్రాల వల్ల నా కెరీర్ ఆశించిన విధంగా సాగలేదు. ఈ చిత్రంతో నాకు పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి పెద్ద పీట వేస్తూ, కుటుంబ సమేతంగా రూపొందించిన చక్కని ప్రేమకథ ఇది’’ అని చెప్పారు.