Ananta sharma
-
నేతాజీ అంగరక్షకుడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ రాజకీయాలను వదిలేసి విదేశాలకు వెళ్లి బ్రిటిష్ వాళ్లపై యుద్ధం ప్రకటించిన రోజులవి. అప్పట్లో ఆయన అంగరక్షకునిగా పనిచేసిన అచంచల దేశభక్తుడు గోపరాజు వేంకట అనంత శర్మ, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆలమూరులో 1920లో జన్మించిన ఆయన 1941లో బ్రిటిష్ ఇండియా ఆర్మీ (బీఐఏ)లో గుమాస్తాగా చేరారు. తరువాత ఆఫీసర్‌గా ఎంపికై శిక్షణ నిమిత్తం మలేషియాలోని కోటాబహార్‌కు వెళ్లారు. బ్రిటన్– జపాన్ల మధ్య జరిగిన యుద్ధంలో వేలాదిమంది బీఐఏ సైనికులు యుద్ధ ఖైదీలుగా జపాన్‌కు చిక్కారు. అందులో గోపరాజు ఒకరు. జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశస్థుల సాయంతో భారత మాతకు విముక్తి కలిగించాలని నేతాజీ తన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) ద్వారా ప్రయత్నించారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులైన గోపరాజు నేతాజీని బ్యాంకాక్‌లోని రత్నకోసిన్ హోటల్లో కలిసి ఐఎన్ ఏలో చేరారు. నేతాజీ అంగరక్షకులలో ఒకరుగా పనిచేశారు. ఎప్పుడూ మిలటరీ దుస్తులలో ఉండే నేతాజీని చూసి ఎంతో ప్రేరణ, గౌరవం కలిగేదని గోపరాజు అంటూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్లు ఇండియన్ నేషనల్ ఆర్మీవారిని యుద్ధఖైదీలుగా ఫిరోజ్‌పూర్ కంటోన్మెంటుకు తరలించారు. వారిలో గోపరాజు అనంత శర్మ కూడా ఉన్నారు. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!) స్వాతంత్య్రోద్యమ దీప్తి నేతాజీ... కనుసన్నలలో గడిపిన మూడేళ్ల కాలం తన జీవితంలో స్వర్ణమయ సమయం అనేవారు వేంకట అనంత శర్మ. ఈయన కొంతకాలం పాటు స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రోత్సాహంతో భారతీయ రైల్వేలో ఉద్యోగిగా చేరి ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్గా పదవీవిరమణ చేశారు. ఈమధ్య జూలై నెలలో ఐకానిక్ వారోత్సవాల వేడుకలలో అమృతోత్సవమును పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే వారు విజయవాడలో స్వాతంత్య్ర సమరవీరులైన శర్మ కుటుంబ సభ్యులను ఉచిత రీతిన గౌరవించడం ముదావహం. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?) – డాక్టర్ ధర్మాల సూర్యనారాయణ మూర్తి, చాంగీ కాండో, సింగపూర్ -
అల్ప సంతోషి
ఒకప్పుడు నీలగిరి కొండల్లో శతానందుడనే మహర్షి గురుకులం నడిపేవాడు. దూరప్రాంతాల నుంచి అక్కడ విద్యను అభ్యసించేందుకు చాలామంది విద్యార్థులు వచ్చేవారు. కొన్నాళ్లు ఆశ్రమంలోనే ఉండి విద్యాభ్యాసం పూర్తయ్యాక తమ తమ ఊర్లకు వెళ్లిపోయేవారు. అవంతిపురం రాజ్యానికి చెందిన అనంత శర్మ అనే యువకుడు కూడా ఆ ఆశ్రమంలో ఉండి చదువుకునేవాడు. అనంతశర్మ ఆశ్రమంలో ఉన్న విద్యార్థుల్లో కెల్లా తెలివైనవాడు. అయితే మహా గర్వి. తను తెలివైనవాడు గనుక అందరూ తనను గౌరవించాలనుకునేవాడు. ముఖ్యంగా గురువు తనను ప్రత్యేకంగా చూడాలనుకునేవాడు. కానీ శతానందుడు అతన్ని మిగతా విద్యార్థులతో సమానంగా చూసేవాడు. ఆయన ధోరణి అనంతశర్మకి నచ్చేది కాదు. ఓ రోజు శతానందుడు ఆశ్రమంలో తన విద్యార్థులకు సాత్విక జీవన విధానం గురించి బోధిస్తున్నాడు. ‘‘మనుషుల మధ్య ఎన్ని అంతరాలున్నా దేవుడి ముందు అందరూ సమానులే! ఉన్నత కులస్తులు, ధనవంతులు, మేధావులు తమని తాము గొప్పవారిగా భావించకూడదు. ఇతరుల కన్నా తమకు ఎక్కువ మర్యాదలు, సౌఖ్యాలు లభించాలని ఆశించకూడదు. దొరికినదానితో తృప్తి పడి జీవించడం అలవాటు చేసుకోవాలి. అలా అల్ప సంతోషిగా జీవించే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు’ అంటూ బోధించాడు. గురువుగారి మాటలు అనంత శర్మకు రుచించలేదు. ‘గురుదేవా..! మన సామర్థ్యానికి, తెలివితేటలకు తగ్గ ప్రతిఫలం పొందటం మన హక్కు కదా!? దాని కోసం ఆశించడంలో తప్పు లేదని నేను భావిస్తున్నాను’ అన్నాడు. ‘‘ఆశించడంలో తప్పులేదు కానీ ఆ ఆశ అత్యాశగా మారకూడదు. తెలివైన వారు పని చెయ్యటం కోసం తమ తెలివిని ఉపయోగించాలి గానీ ప్రతిఫలం పొందటం కోసం ఉపయోగించకూడదు. అలా చేస్తే కొన్నిసార్లు దొరికిన ప్రతిఫలం కూడా చేజారిపోవచ్చు’’ అంటూ అనంత శర్మకు బోధించాడు శతానందుడు. ఆశ్రమ నియమాల ప్రకారం అక్కడ చదువుకొనే విద్యార్థులు వ్యవసాయపనులు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో చుట్టుపక్కల గల పొలాలకు వెళ్లి అక్కడ రైతులకు సేద్యపు పనుల్లో సాయపడాలి. దీనివల్ల రైతుల కష్టాల గురించి విద్యార్థులకు తెలుస్తుంది. ఓ రోజు గురువు ఆదేశానుసారం విద్యార్థులంతా ఓ రైతు పొలంలో పని చేశారు. ఆ రైతు పొలంలో ఒక మామిడి చెట్టు ఉంది. ఆ రైతు బాగా పండిన పళ్లను బుట్టనిండా కోసుకొచ్చి గురువుగారికి అందించాడు. శతానందుడు తానొక పండు తీసుకుని మిగతా పండ్లను ఒక్కొక్కరికీ ఒక్కటి చొప్పున పంచమని అనంతశర్మను ఆదేశించాడు. ఆ బుట్టలో ఒక పెద్ద పండు ఉండటం అనంత శర్మ గమనించాడు. మిగతా పండ్లు చిన్నగా ఉన్నాయి. అనంతశర్మ అందరికీ చిన్న పండ్లు పంచి తాను పెద్ద పండు తీసుకొన్నాడు. మిగతా పండ్లను రైతుకిచ్చేశాడు. తర్వాత అందరూ పండ్లు తిన్నారు. అందరి పండ్లు తియ్యగా ఉన్నాయి. కానీ అనంతశర్మ తీసుకున్న పెద్ద పండు మాత్రం పుల్లగా ఉంది. దాన్ని తినలేక అతను పండును పారవేశాడు. అది గమనించిన శతానందుడు ‘‘చూశావా శర్మా? మిగతా వారి కన్నా ఎక్కువ ప్రతిఫలం పొందాలని నువ్వు పెద్ద పండు తీసుకున్నావ్. కానీ అది తినటానికి పనికి రాకుండా పోయింది. కొన్ని సార్లు అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తుందనటానికి ఇదే ఉదాహరణ. అందుకే దొరికిన దానితో తృప్తి పడాలని పెద్దలంటారు. అల్ప సంతోషిగా జీవించే వ్యక్తికి జీవితంలో అసంతృప్తి అనేదే ఉండదు’’ అంటూ హితబోధ చేసి ఆనక రైతుకి చెప్పి అనంతశర్మకు మరో పండు ఇప్పించాడు. అలా జ్ఞానోదయమైన అనంతశర్మ ఆ నాటి నుంచి గర్వాన్ని, అత్యాశను విడిచి అల్ప సంతోషిగా ఉంటూ తృప్తిగా జీవించసాగాడు. -
శ్రీ మహాలక్ష్మీదేవి
ఏడవ రోజు శుక్రవారం అలంకారం ఈరోజు అమ్మవారిని త్రిశక్తి స్వరూపాలలో ధనాధిష్ఠాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మిగా అలంకరిస్తారు. జగత్కల్యాణ స్థితికారిణి అయిన అమ్మ ధనధాన్యధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజ లక్ష్ములుగా అష్ట సిద్ధులనూ ప్రసాదించే అమృత స్వరూపిణిగా, సురాసురులు పాలకడలిని చిలికినప్పుడు క్షీరాబ్ది కన్యకగా పుట్టిన వరాలతల్లి హాలుడు అను రాక్షసుణ్ణి సంహరించి మహాలక్ష్మిగా పేరుగాంచినట్లు ప్రతీతి. వరదాభయ హస్తాలతో కనకధారలు కురిపిస్తూ కమలాసనాసీనురాలై మహాలక్ష్మి రూపంలో దుర్గాదేవిని దర్శిస్తే సమస్త ఆర్థిక బాధలూ తొలగిపోయి సుఖసంతోషాలతో తులతూగుతారని నమ్మకం. శ్లోకం: పుత్రాన్ దేహి ధనం దేహి సౌభాగ్యం దేహి సువ్రతే అన్యాంశ్చ సర్వకామాంశ్చ దేహి దేవి నమోస్తుతే! భావం: సౌభాగ్యం, సత్సంతానం, ధనధాన్యాదులు ఇచ్చి లోకాలను కాపాడు జగదంబా నీకు నమస్సులు. నివేదన: బెల్లం పాయసం, శనగలు ఫలమ్: ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అన్నివిధాలుగా పురోభివృద్ధి కలుగుతుంది. - దేశపతి అనంతశర్మ