ananthnag attack
-
కశ్మీర్లో ఆపరేషన్ సక్సెస్: ప్రధాన ఉగ్రవాది అరెస్ట్
కశ్మీర్: ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న లష్కరే -ఈ -ముస్తఫా వ్యవస్థాపకుడు హిదాయతుల్లా మాలిక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కశ్మీర్లో జరిపిన దాడుల్లో ఈ కీలకమైన ఉగ్రవాది ఆచూకీ లభించింది. అదుపులోకి తీసుకునే క్రమంలో అతడు ఎదురుదాడికి దిగాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై అతి కష్టమ్మీద హిదాయతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి కశ్మీర్ వెళ్తుండగా అతడిని అరెస్ట్ చేశారు. జమ్మూ, అనంత్‌నాగ్ పోలీసులు సంయుక్తంగా శనివారం ఆపరేషన్ చేపట్టగా కుంజువాణి ప్రాంతంలో హిదాయతుల్లా కనిపించాడు. వాహనాల తనిఖీ సమయంలో కనిపించిన అతడి వివరాలు అడగడానికి ప్రయత్నించగా పోలీసులపై తుపాకీతో ఎదురు దాడి దిగాడు. దీంతో పోలీసులు అతడిని చుట్టుముట్టేసి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పిస్టోల్, ఓ గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ సీనియర్ ఎస్పీ శ్రీధర్ పాటిల్ తెలిపారు. కశ్మీర్ లోయలో జైషే- ఈ- మహ్మద్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియ్సాలి ఉంది. -
'అనుమతి లేకుండా వెళ్లినందునే ఉగ్రదాడికి గురి'
న్యూఢిల్లీ: అనుమతి తీసుకోకుండా డ్రైవర్ బస్సును తీసుకెళ్లడం మూలంగానే అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడికి గురి కావాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భద్రతా అధికారుల హెచ్చరికలను అతడు పరిగణనలోకి తీసుకుంటే ప్రమాదం తప్పిం ఉండేదని స్పష్టం చేసింది. కశ్మీర్లో అమర్నాథ్యాత్రకు వెళ్లొస్తున్న భక్తులపై ఉగ్రవాదుల దాడి, చైనాతో సరిహద్దు వివాదం గురించి శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇతర పార్టీల వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ కార్యదర్శులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమాధానాలు చెప్పారు. పలు సూచనలు చేసిన పార్టీలు చైనాతో సరిహద్దు వివాదాన్ని దౌత్య మార్గంలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ, సమగ్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.