సీబీఐకి చిక్కిన సెన్సార్ బోర్డు అధికారి
హైదరాబాద్: సీబీఐ వలలో అవినీతి తిమింగలం చిక్కింది. కేంద్ర సెన్సార్ బోర్డు అధికారి శ్రీనివాస్ ను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 'అందాల చందమామ' సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చేందుకు శ్రీనివాస్ లక్ష రూపాయాలు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
మధులగ్నదాస్, ఐశ్వర్య, సూర్యతేజ, రమణలాల్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం 'అందాల చందమామ'. కేయస్ మూర్తి దర్శకత్వంలో పీడీఆర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వై. సునీల్ పాటలు స్వరపరిచారు.