andhariki illu
-
అమ్ముకున్నారు.. రెచ్చగొడుతున్నారు
సాక్షి, మంగళగిరి(గుంటూరు) : ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అంటూ పథకానికి శ్రీకారం చుట్టింది. పథకాన్ని పేదలకు కాకుండా తాము సొమ్ము చేసుకునేందుకు అన్నట్లుగా మున్సిపల్ టీడీపీ పాలకులు వార్డుల వారీగా ఇళ్లు కేటాయించుకుని ఒక్కో ఇంటిని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారు. పథకంలో జరిగిన అవినీతిపై టీడీపీ ప్రజాప్రతిని ధులే ధర్నాలకు దిగడంతో లబ్ధిదారుల జాబితాను ప్రకటించలేకపోయారు. ఒక్కో కౌన్సిలర్ వార్డుకు కేటాయించిన ఇళ్లకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేయగా, చైర్మన్, షాడో చైర్మన్లు రూ.కోటికిపైగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందడం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో డబ్బులు వసూలు చేసిన ప్రజాప్రతినిధుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లబ్ధిదారులు తమకు ఇళ్లు రాకపోతే తీసుకున్న డబ్బులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వానికి కట్టిన డీడీల డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతుండడంతో కొత్తనాటకానికి తెరతీశారు. లబ్ధిదారులలో తమ బినామీలైన ఐదుగురు మహిళలను గ్రూపు లీడర్లుగా ఎంపిక చేసి, కొంత మంది లబ్ధిదారులను రెచ్చగొట్టి ప్రతి రోజు తమకు ఇళ్లు కావాలంటూ మున్సిపాల్టీతో పాటు ఇళ్ల నిర్మాణం వద్ద ఆందోళనలు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి. 2,300 మంది లబ్ధిదారులుండగా ప్రతి రోజు ఆందోళన పేరుతో 30 మంది మహిళలు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తుండగా, ఐదుగురు మహిళలు వారికి లీడర్లుగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మున్సిపల్ అధికారులు డీడీలు కట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇళ్లు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా ప్రతి రోజు ఆందోళన చేస్తుండడం వెనుక డబ్బులు తీసుకున్న కొందరు కౌన్సిలర్లు ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ విచారణ వాస్తవానికి డీడీలు కట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇచ్చేదానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అందరికీ ఇళ్లు పథకంపై విజిలెన్స్ విచారణ కోరగా, విజలెన్స్ విచారణ చేపట్టింది. విచారణ పూర్తయిన వెంటనే అర్హులు జాబితాను విడుదల చేసి ఇళ్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే ఆర్కేతో పాటు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ లోపు తాము ఎక్కడ తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలనే ఆందోళనతో మాజీ కౌన్సిలర్లు పన్నాగం ప్రకారం లబ్ధిదారులతో పాటు అమ్ముకున్న ఇళ్ల వారిని రెచ్చకొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని తెలిసింది. వాస్తవానికి గత కొద్ది కాలంగా మాజీ కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చిన లబ్ధిదారులు అనర్హులు తమకు ఇళ్లు రావని తెలుసుకుని తాము ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని మాజీ కౌన్సిలర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు మాజీ కౌన్సిలర్లు స్థానికంగా ఉన్న బలంతో ఇళ్లు వస్తాయని, రాకుంటే మీ డబ్బు మీకు ఇస్తామంటూ బాధితుల నోరు మూయిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు ఒక్కో వార్డులో రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన మాజీ కౌన్సిలర్లతో పాటు రూ.కోట్లు వసూలు చేసిన మున్సిపల్ మాజీ చైర్మన్, షాడో చైర్మన్లు బాధితులు తీసుకువస్తున్న ఒత్తిడి నుంచి బయటపడే పరిస్థితి తెలియక కొట్టుమిట్టాడుతున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లో విజిలెన్స్ విచారణ అనంతరం అధికారులు అర్హుల జాబితాను విడుదల చేసినట్లయితే అనర్హుల నుంచి వసూలు చేసిన డబ్బులతో అర్హుల వద్ద అధిక సంఖ్యలో వసూలు చేసిన డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకతప్పదు. గత ఐదేళ్ల పాలనలో మున్సిపాల్టీని అవినీతి కూపంగా మార్చారనే అపప్రద మూటకట్టుకున్న టీడీపీతో పాటు మిత్రపక్షాలు ఇప్పుడు అందరికీ ఇళ్ల పథకంలో అంటిన అవినీతి మురికిని వదిలించుకోలేని పరిస్థితిలో బాధితులు కేసులు పెడితే శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితే లేదని అధికారులతో పాటు ఆయా పార్టీల నాయకులు చెబుతుండడం విశేషం. దీనిపై మున్సిపల్ కమిషనర్ హేమమాలిని మాట్లాడుతూ అందరికీ ఇళ్లు పథకంలో గతంలో డీడీలు కట్టిన అర్హులందరికీ తప్పకుండా ఇళ్లు ఇస్తామని తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. అనర్హులు తేలితే వారిని తొలగించి వారి స్థానంలో 1,728 ఇళ్ల జాబితా అనంతరం డీడీలు కట్టిన అర్హులకు కేటాయిస్తామని తెలిపారు. అనవసరంగా ఆందోళనలు చేసి అధికారుల సమయం వృథా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అర్హులందరికీ న్యాయం జరుగుతుందని వివరించారు. -
‘అందరికీ ఇళ్లు’ అంతా అక్రమాలే
సాక్షి, భీమవరం(పశ్చిమగోదావరి) : అందరికీ ఇళ్లు (హౌసింగ్ ఫర్ ఆల్) అంటూ గత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసి పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను చూపించింది. వాటిలోని అవకతవకలు ప్రస్తుత సర్వేలో బయటపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్ట ణాల్లో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదల నుంచి దరఖాస్తుల ఆహ్వానించారు. ఆ సమయంలో భీమవరంలో 11,670 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు వివిధ రకాల సర్వేలు చేసి సుమారు 9,500 మందిని ఎంపిక చేశారు. అందుబాటులో ఉన్న భూమి అందరికీ ఇళ్లు నిర్మించేందుకు సరిపోతుందని అధికారులు నిర్ధారించారు. పట్టణ పరిధిలో 8,352 మందికి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. పాలకొల్లులో 7,159 మంది, తాడేపల్లిగూడెంలో సుమారు 5,500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. టీడీపీ అధికారంలో ఉండడంతో అప్పట్లో కొంతమంది ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు లబ్ధిదారుల నుంచి ముడుపులు తీసుకుని పొరుగు గ్రామాల్లోన్ని టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులకు సైతం లబ్ధిదారులు జాబితాలో చోటు కల్పించారనే విమర్శలు వచ్చాయి. అధికారులు వీటిని పట్టించుకోకుండా నాయకులు అడుగులకు మడుగులొత్తుతూ పొరుగు ప్రాంతాల వారికి సైతం ఇళ్లు మంజూరు చేశారు. లబ్ధిదారుల జాబితాలో చేరడానికి కొంతమంది తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డులను సైతం భీమవరానికి బదిలీ చేయించుకున్నారు. సర్వేలో బయటపడుతున్న అనర్హుల సంఖ్య గ్రామాలు, పట్టణాల్లో ఉగాది నాటికి 25 లక్షలమంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో మళ్లీ పట్టణాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లోని వార్డుల వారీగా వలంటీర్లతో సర్వే చేపట్టింది. దీనిలో గతంలో ఇళ్లు పొందిన వారు, అప్పట్లో దరఖాస్తు చేసుకున్నా మంజూరుకాని పేదలు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న ప్రజలు భీమవరం పట్టణంలో దాదాపు 15,682 మంది ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లోని వార్డుల వారీగా వార్డు వలంటీర్లతో సర్వే చేపట్టింది. దీనితో గతంలో అక్రమంగా అందరికీ ఇళ్లు పథకంలో ఇళ్లు పొందిన వారి అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ విధంగా భీమవరం పట్టణంలోనే సుమారు 2 వేల మంది అనర్హులకు అప్పటి ప్రజాప్రతినిధులు అక్రమార్గంలో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఏలూరులో కూడా అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. సర్వే ప్రకారం అక్రమార్కులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తారనే ప్రచారం జోరందుకోవడంతో ఇళ్ల కోసం సొమ్ములు చెల్లించిన లబ్ధిదారులు టీడీపీ నాయకులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ఇల్లు మంజూరుకాకపోగా కట్టిన సొమ్ములు కూడా చేతికి అందకుండా పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో పార్టీ అధికారంలో ఉందని టీడీపీ నాయకులను ఆశ్రయించి మోసం పోయామని అనేకమంది లబోదిబో మంటున్నారు. వైఎస్ హయాంలో 82 ఎకరాలు సేకరణ భీమవరం పట్టణం 12వ వార్డు తాడేరురోడ్డులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రోత్సాహంతో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 82 ఎకరాలు సేకరించారు. ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణానికి టీడీపీ హయాంలో 2017లో శంకుస్థాపన చేశారు. ఏపీ టిడ్కో నేతృత్వంలో ఎల్అండ్టీ సంస్థ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అక్కడ దాదాపు మూడు వేలు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. 323 మందికి రూ. 11.2 కోట్లు రుణం మంజూరు కాగా 300 మంది లబ్ధిదారులకు సంబంధించి రూ.3.66 కోట్ల చెక్కులు టిడ్కోకు అందజేశారు. ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరుగుతున్నాయని నిర్మాణం వ్యయం కూడా భారీగా పెంచి అధికార పార్టీ నాయకుల సొమ్ము చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రం«ధి శ్రీనివాస్ నేతృత్వంలో అనేక ఆందోళనలు చేపట్టారు. లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా లేదని అనర్హులకు అవకాశం కల్పించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి అధికార పార్టీ వీటిని పట్టించుకోకుండా ఇళ్ల నిర్మాణం కొనసాగించింది. -
వేగంగా అందరికీ ఇళ్ళ పథకం
సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆదేశం కాకినాడ సిటీ : ప్రధానమంత్రి ఆవాస్యోజన, ఎ¯ŒSటీఆర్ నగర్ పథకం కింద అందరికీ ఇళ్ళు నిర్మించే కార్యక్రమం త్వరితగతిన జరగాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అందరికీ ఇళ్ళు పథకం అమలును జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, ఏపీటెడ్కో అధికారులతో సమీక్షించారు. ఈ పథకం కింద జిల్లాలోని మున్సిపాలిటీలలో 19,242 మంది లబ్ధిదారులకు జిప్లస్ 3 గృహాలు నిర్మిస్తామన్నారు. ఆయా కేటగిరీల ఆధారంగా లబ్ధిదారుల వాటా సొమ్మును జూలై 20లోగా సేకరించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. జిల్లాలో లబ్ధిదారుల వాటా చెల్లించిన వెంటనే బ్యాంక్ లింకేజీ కోసం చర్యలు తీసుకొంటాయన్నారు. ఏపీటెడ్కో ఎస్ఈ బి.శ్రీనివాసరావు, ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం ఎం.ఏ అబ్దుల్ రెహమాన్, ఎస్బీఐ జిల్లా కో–ఆరి్డనేటర్ వి.హనుమంతరావు, కాకినాడ అడిషనల్ మున్సిపల్ కమిషనర్ వై.శ్రీనివాసరావు, ఏపీటెడ్కో ఈఈ రీటా, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ‘ఉపాధి’ పనులను అప్లోడ్ చేయండి ఉపాధి హామీ పథకం సమన్వయంతో వివిధ శాఖల ద్వారా నిర్వహించిన పనులన్నిటి సమాచారాన్ని గురువారం మధ్యాహ్నం ఆ¯ŒSలై¯ŒSలో అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాలులో ఉపాధిహామీ పథకం సమన్వయంతో పనులు నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, డీఆర్డీఏ, ఫిషరీస్, సెరికల్చర్, పశుసంవర్థక శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ, అంగ¯ŒSవాడీ భవనాలు, శ్మశానాల పనులను, డీఆర్డీఏ ద్వారా చేపట్టిన రోడ్ల వెంట చెట్ల నాటడం, ఐటీడీఏ ద్వారా ఉద్యానవనాల విస్తరణ పనులను ఆయన సమీక్షించారు. ఆగస్టు 15నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున, జాయింట్ కలెక్టర్–2, జె.రాధాకృష్ణమూర్తి, డ్వాక్రా పీడీ జి.రాజకుమారి పాల్గొన్నారు.